Share News

Sonu Sood: సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Mar 25 , 2025 | 06:10 PM

కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి సోనూసూద్ సాయం చేశారు. ఇప్పటికీ కూడా తన చారీటీ సంస్థ ద్వారా సాయం చేస్తూనే ఉన్నారు. అందరి మంచీ కోరే సోనూసూద్ భార్య ప్రమాదానికి గురైంది.

Sonu Sood: సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. ఏం జరిగిందంటే..
Sonu Sood

అందరి మంచి గురించి ఆలోచించే ప్రముఖ నటుడు సోనూసూద్ ఇంట్లోనే చెడు జరిగింది. సోనూసూద్ భార్య సోనాలి ప్రయాణిస్తున్న కారు హైవేపై యాక్సిడెంట్‌కు గురైంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో సోనాలి తీవ్రంగా గాయపడింది. ఆమెతో పాటు ఆమె అక్క కుమారుడికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళవారం ఉదయం సోనాలి తన అక్క కుమారుడు, మరో మహిళతో కలిసి ముంబై- నాగ్‌పూర్ హైవేపై కారులో వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొట్టింది. గాయాలపాలైన వారిద్దరూ ప్రస్తుతం మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిందని తెలియగానే సోనూసూద్ హుటాహుటిన నాగ్‌పూర్ వెళ్లారు. ప్రస్తుతం భార్య బాగోగులు చూసుకుంటూ ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇక, ఈ సంఘటనపై సోనూసూద్ స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘ సోనాలి ఇప్పుడు బాగానే ఉంది. అదృష్టం వల్ల ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది. ఓం సాయి రాం’ అని అన్నారు.


ఏపీకి 4 అంబులెన్సులు సాయం

తన నటనతో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్.. సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. కరోనా టైంలో కొన్ని లక్షల మందికి ఆయన సాయం చేశారు. సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కొద్దిరోజుల క్రితమే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. రాష్ట్ర ప్రభుత్వానికి 4 అంబులెన్సులను బహుమతిగా ఇచ్చారు. అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తరలించేందుకు, సుదూర ప్రాంతాల్లో క్లిష్టమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా అంబులెన్స్‌లు అందించిన సోనూసూద్‌ను ముఖ్యమంత్రి అభినందించారు.


ఇవి కూడా చదవండి:

BSNL 5G: మొదట ఈ నగరంలోనే బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు..కంపెనీ సీఎండీ కీలక ప్రకటన

Eknath Shinde-Kunal Kamra: సుపారీ తీసుకున్నారేమో?.. కునాల్ వ్యాఖ్యలపై షిండే

ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఇలా చేయండి..

Updated Date - Mar 25 , 2025 | 06:51 PM