Home » Car
రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం ఏడుగురు దుర్మరణం చెందారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన 8 మంది కొత్త కారుకు తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేయించి తిరిగి వస్తుండగా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామం మలుపు వద్ద కారు అతివేగంగా చెట్టును ఢీకొంది.
దేశంలో వర్షాకాలంలో ఎక్కువగా కార్లు నీట మునిగి ప్రమాదాలు జరిగిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. దీంతోపాటు ఆకస్మాత్తుగా కార్లు.. చెరువులు, కాలువల్లోకి దూసుకెళ్లి పలువురు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కార్ల నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
ప్రముఖ కంపెనీ మారుతి సుజుకి తన కస్టమర్లకు కీలక అనౌన్స్మెంట్ చేసింది. ఇటివల మార్కెట్లోకి వచ్చిన జిమ్నీ SUVని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎందుకు రీకాల్ చేశారు, ఏంటి లోపం అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు విలాసవంతమైన రోల్స్ రాయిస్ కార్‌ను తక్కువ మొత్తంతో కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. దీనిని తక్కువ రేటుతో కొనుగోలు చేయడం ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పులివెందుల వైసీపీ నాయకుల చెరలో ఉన్న ఆరు కార్లు యజమానికి చేరాయి. సంగారెడ్డికి చెందిన హరహర రెంటల్ కార్ ట్రావెల్స్ యజమాని సతీష్ కుమార్.. వికారాబాద్‌కు చెందిన మణిరాజ్కు 2021లో ఆరు కార్లు అద్దెకిచ్చాడు. మణిరాజ్ నుంచి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు ఆరు కార్లను లీజ్‌కు తీసుకుని పులివెందులకు తీసుకువెళ్లి అక్కడే ఉంచుకున్నారు.
హైదరాబాద్: నగరంలోని లంగర్‌హౌస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్విఫ్ట్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో బైక్, ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌కై వెళుతున్న దంపతులు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మీరు మంచి ఖరీదైన కారును తక్కువ ధరకు పొందాలని అనుకుంటే మీకు గుడ్ న్యూస్. ఇటివల BMW బ్రాండ్ దాదాపు రూ. 50 లక్షల విలువైన కారును కేవలం రూ. 7.5 లక్షలకే మీ ఇంటికి తీసుకెళ్లవచ్చని ప్రకటించారు. అయితే అది ఎలా అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
కేరళలో అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టేందుకు అంబులెన్స్‌లో అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తున్నారు. రోడ్డుపై అన్ని వాహనాలూ అంబులెన్స్‌కి దారిచ్చాయి. అయితే ఓ కారు యజమాని మాత్రం అంబులెన్స్ డ్రైవర్‌కు చుక్కలు చూపించాడు.
పండగపూట భార్యతో తగాదా పడిన ఓ వ్యక్తి... తన ఆగ్రహవేశాల్ని కారు నడపటంలో చూపించాడు. కట్టలు తెంచుకుంటున్న ఆవేశాన్ని ఆపుకోలేక మితిమీరిన వేగంతో వాహనం నడిపాడు.
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో చోటుచేసుకున్నఅక్రమాలపై విచారణకు అవినీతి నిరోధక శాఖకు (ఏసీబీ) ప్రభుత్వం అనుమతిచ్చింది.