Share News

10th grade exam: ప్లీజ్‌ పాస్‌ చేయండి నా ప్రేమ మీ చేతుల్లో ఉంది

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:39 AM

బెళగావి జిల్లా చిక్కోడిలో జరిగిన పదో తరగతి మూల్యాంకన కేంద్రంలో ఓ విద్యార్థి తన జవాబు పత్రంలో ప్రియురాలితో సంబంధం కొనసాగించేందుకు పాస్ కావాలని కోరుతూ ప్రేమ సందేశాన్ని, అలాగే 500 రూపాయల నోటును జత చేశాడు. ఈ సంఘటన అందరిని ఆశ్చర్యపరచింది.

 10th grade exam: ప్లీజ్‌ పాస్‌ చేయండి నా ప్రేమ మీ చేతుల్లో ఉంది

జవాబు పత్రంలో పదో తరగతి విద్యార్థి అభ్యర్థన

బెంగళూరు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): పరీక్షల్లో భిన్నమైన అంశాలను ప్రస్తావిస్తూ కొందరు విద్యార్థులు రాస్తుంటారు. అటువంటిదే బెళగావి జిల్లా చిక్కోడిలో ఏర్పాటు చేసిన పదో తరగతి మూల్యాంకన కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థి జవాబు పత్రంలో విచిత్ర సందేశాన్ని చూసి అక్కడున్నవారు ఆశ్చర్యానికి లోనయ్యారు. పదో తరగతి పాస్‌ అయితేనే నీతో ప్రేమ కొనసాగిస్తానని ప్రియురాలు చెప్పిందని ఏకంగా విద్యార్థి ఆన్షర్‌షీట్‌లో రాశాడు. ‘నా ప్రేమ మీ చేతుల్లో ఉంది.. అమ్మాయి ప్రేమ కొనసాగాలంటే నేను పాస్‌ కావాలి సార్‌/మేడం. దయచేసి పాస్‌ చేయండి. ఈ 500తో టీ తాగండి, నన్ను పాస్‌ చేయండి’ అంటూ ఆన్షర్‌షీట్ల మధ్యన 500 రూపాయల నోటు జత చేశాడు.


ఇవి కూడా చదవండి:

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్


Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది


Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 21 , 2025 | 04:39 AM