Supreme Court: భావ ప్రకటనా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:22 PM
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు (శుక్రవారం) కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రజస్వామ్య సమాజంలో అంతర్భాగమని.. దాన్ని పరిరక్షించడం కోర్టుల బాధ్యత అని స్పష్టం చేసింది. ఆ వివరాలు..

న్యూఢిల్లీ: భావ ప్రకటనా స్వేచ్ఛపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్య దేశంలో ఒక భాగమని.. దాన్ని పరిరక్షించడం కోర్టుల బాధ్యత అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గుజరాత్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్య్రం అనేది ప్రజాస్వామ్య సమాజంలో ఒక అంతర్భాగమని.. దాన్ని రక్షించడం కోర్టుల విధి అని స్పష్టం చేసింది.
కేసేంటంటే..
గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి గతేడాది అనగా 2024, డిసెంబర్‌లో తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇమ్రాన్ ఓ పెళ్లి వేడుకకు హాజరైన సందర్భంగా తీసిన వీడియో అది. దానిలో ఇమ్రాన్.. పెళ్లి వేడుక మధ్యలో నుంచి నడిచి వస్తుండగా.. ఆయనపై పూల వర్షం కురిపిస్తారు. ఇక బ్యాగ్రౌండ్‌లో ఓ పద్యం కూడా వినిపిస్తుంది.
అయతే ఈ పద్యంలోని పదాలు.. మత విశ్వాసాలు, జాతి ఐక్యతను దెబ్బ తీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ.. ఇమ్రాన్‌పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాల్సిందిగా కోరుతూ.. ఇమ్రాన్ గుజరాత్ కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. దాన్ని కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ.. ఇమ్రాన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు.
తాజాగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జ్ భుమాన్ నేతృత్వంలోని ధర్మాసానం.. ఇమ్రాన్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్శంగా గుజరాత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. వాక్ స్వాతంత్య్రంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
"కవిత్యం, సినిమా, నాటకాలు, కళలు, సాహిత్యం వంటి అంశాలు మనుషుల జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తాయి. ఆలోచనలు, అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ లేనప్పుడు వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. అలాంటప్పుడు ప్రతి వాదనలతో వాటిని ఎదుర్కోవాలి.. తప్ప అణచివేయాలని చూడకూడదు. ఒకవేళ ఈ వ్యాఖ్యలపై ఆంక్షలు విధిస్తే.. అవి సరైనవిగా ఉండాలి తప్పితే ఊహాజనితంగా కాదు. ఓ వ్యక్తి వెలిబుచ్చే అభిప్రాయాలను ఎంతమంది వ్యతిరేకించినా సరే.. ఆవ్యక్తి భావ ప్రటననా హక్కును తప్పనిసరిగా గౌరవించాల్సిందే. వాక్ స్వాతంత్య్రం అనేది ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడటం న్యాయస్థానాల విధి" అని ధర్మస్థానం స్పష్టం చేసింది. అంతేకాక ఎంపీపై నమోదైన కేసును కొట్టి వేసింది.
ఇవి కూడా చదవండి:
కొత్తిమీర త్వరగా వాడిపోతోందా.. అయితే ఈ వీడియో మీకోసమే..
ట్రంప్ టారిఫ్ అలజడుల 'చిదంబర' రహస్యం?