Home » Supreme Court
'పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందని అంటున్నారు. చారిత్రక, పురావస్తు ఆస్తులను వక్ఫ్గా ప్రకటించడానికి వీలు లేదు'
ఇటీవల మోదీ సర్కారు ఆమోదించిన వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో మోదీ సర్కారుకు ఉపశమనం లభించినట్లైంది.
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాద వృత్తిలో చేరారు. మహారాష్ట్ర హైకోర్టు జడ్జి, మాజీ అడ్వకేట్ జనరల్ బారిస్టర్ రాజా భోంస్లేతో ఆయన పనిచేశారు. 1987 నుంచి 1990 వరకూ ముంబై హైకోర్టులో ఆయన సొంతంగా లా ప్రాక్టీస్ చేశారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.
Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంలో విచారణ జరుగగా.. ప్రభుత్వంపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు.
సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లపై విచారణ ప్రారంభించనుంది. ఈ చట్టం రాజ్యాంగానికి విరుద్ధమని, జాతీయ సమగ్రతకు ముప్పు కలిగించేదిగా పేర్కొంటూ పిటిషన్లు దాఖలైనవి.
సుప్రీంకోర్టు, వరకట్న వేధింపులు మరియు మెయింటెనెన్స్ చెల్లింపులకు సంబంధించిన చట్టాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. కోర్టు చట్టాలు చేయలేమని, ఈ పని పార్లమెంట్ చేయాల్సిన బాధ్యత అని పేర్కొంది.
వైఎస్ వివేకా హత్య జరిగిన తరువాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి, గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరని సునీతా తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీచేసింది.
కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవేనని, ఎన్నో ఏళ్లుగా అవి రెవెన్యూ భూములుగా రికార్డుల్లో నమోదై ఉన్నాయని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.
తమిళిగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ అమోదించిన వక్ఫ్చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ అంశాన్ని కాంగ్రెస్, ఎంఐఎంతో పాటు పలువురు సవాల్ చేయగా తాజాగా విజయ్ కూడా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు.