Share News

Mobile Addiction: సెల్‌ లో బందీలైతే మెదడు మొద్దుబారుతుంది

ABN , Publish Date - Apr 28 , 2025 | 05:08 AM

సెల్‌ఫోన్‌లు మన జీవితం సులభతరం చేసినా, వాటి వల్ల నష్టం కూడా పెరుగుతోంది. స్క్రీన్‌ సమయం ఎక్కువ కావడం వలన పిల్లలు, టీనేజర్లు నిద్రలేమి, కుంగుబాటు, ఐక్యూ స్థాయి తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని సర్వేలు సూచిస్తున్నాయి. పుస్తక పఠనం లోపించి, స్పష్టమైన ఆలోచన శక్తి తగ్గిపోతుందని కూడా సర్వేలో వెల్లడైంది.

Mobile Addiction: సెల్‌ లో బందీలైతే మెదడు మొద్దుబారుతుంది

తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: జీవితాన్ని ఎంతో సులభతరం చేసి, సమయాన్ని ఆదా చేస్తున్న సెల్‌ఫోన్లతో లాభం ఎంతుందో నష్టం కూడా అంతకన్నా ఎక్కువగా ఉందని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. పిల్లలైతే సెల్‌ఫోన్‌లో బందీలవుతున్నారు. స్ర్కీన్‌లను విడిచిపెట్టడం లేదు. దీంతో నిద్రలేమి, కుంగుబాటు వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయని ఇప్పటికే రుజువైంది. ఇది మానవ మేధోశక్తిపైనా ప్రభావం చూపుతుందని, ఫలితంగా ఐక్యూ స్థాయి తగ్గిపోతుందని మిషిగాన్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన ‘మానిటరింగ్‌ ది ఫ్యూచర్‌’ సర్వేలో వెల్లడైంది. సర్వే సమాచారాన్ని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ప్రచురించింది. స్ర్కీన్‌ టైం అధికమైతే టీనేజర్లు, యువకుల్లో వివేచన సామర్థ్యం తగ్గుతున్నట్టు తేలింది. ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి మందగించడం, ప్రాథమిక స్థాయి తార్కిక శక్తి లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మెదడు పనితీరులోనే మార్పులున్నట్టు గుర్తించారు. గతంలో పిల్లలు, టీనేజర్లు పుస్తకాలు, చిన్న కథలు చదివేవారు. ఎలకా్ట్రనిక్‌ గ్యాడ్జెట్స్‌ వచ్చాక పుస్తక పఠనంపై ఆసక్తి కనబరిచేవారే లేరు. అమెరికాలో జరిగిన సర్వే ప్రకారం 2012లో 45శాతం మందికి పుస్తక పఠనం అలవాటుగా ఉండేది. 2021 నాటికి అది 38 శాతానికి పడిపోయింది. ప్రతిదీ ఒక క్లిక్‌, స్వైప్‌ ద్వారా లభిస్తుండడంతో దేన్నీ గుర్తించుకోవాల్సిన అవసరం లేకపోయింది. దాంతో స్పష్టంగా ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు.


ఇవి కూడా చదవండి:

Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా

Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు

Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా

Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 28 , 2025 | 05:08 AM