Pahalgam Terror Attack: కలిమా పఠించకపోవడంతో కాల్పులు
ABN , Publish Date - Apr 24 , 2025 | 06:00 AM
పహల్గామ్‌లోని ఉగ్రదాడిలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఎల్‌ఐసీ మేనేజర్ సుశీల్ నతన్యాల్ మరియు అతని కుటుంబాన్ని లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్చారు. వారి బంధువులు, ఉగ్రవాదులకు కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
దాడిలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఎల్‌ఐసీ మేనేజర్ హతం
ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని బంధువుల డిమాండ్
ఇండోర్, ఏప్రిల్ 23: పహల్గామ్ ఉగ్రదాడిలో మరిన్ని విషాదకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడిన ఉగ్రవాదులు మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక ఎల్‌ఐసీ మేనేజర్ సుశీల్ నతన్యాల్ (58)ను ఇస్లామిక్ ఽధర్మోక్తి (కల్మా)ను పఠించమని అడిగారు. తాను పఠించలేనని చెప్పడంతో తలపై కాల్చిచంపారు. తన తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసి భయపడి ఆయన వైపు పరుగుతీసిన సుశీల్ కూతురు ఆకాంక్ష (35) కాలుపై కాల్చారు. ప్రస్తుతం ఆమె జమ్మూకశ్మీర్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్రైస్తవ మతానికి చెందిన సుశీల్ నతన్యాల్ ఈస్టర్ సందర్భంగా తన భార్య, కూతురు, కుమారుడితో కలిసి పహల్గామ్‌కు వెళ్లారని వారి బంధువు సంజయ్ కుమ్రావత్ తెలిపారు. అమాయకులైన పర్యాటకులపై దాడి హేయమైన చర్య అని, ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదని వారి బంధువులు అన్నారు. దాడులకు పాల్పడిన వారిని వదలకూడదని, వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఇండోర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ సంఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని, జమ్మూకశ్మీర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..