UPSC Civil Services: సివిల్స్ టాపర్‌కు 1,043 మార్కులు
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:54 AM
ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో శక్తి దూబే టాప్ ర్యాంక్ సాధించారు. 2,025 మార్కులలో 1,043 మార్కులు సాధించి 51.5 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. రెండో ర్యాంకు సాధించిన హర్షితా గోయల్ 1,038 మార్కులు సాధించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో టాప్ ర్యాంక్ సాధించిన శక్తి దూబే.. ఆ పరీక్షలో మొత్తం 2,025 మార్కులకుగాను 1,043 మార్కులు సాధించారు. రాతపరీక్షలో 1750 మార్కులకుగాను 843, ఇంటర్వ్యూలో 250 మార్కులకుగాను 200 మార్కులు పొందారు. మొత్తంగా 51.5 శాతం మార్కులతో టాపర్‌గా నిలిచారు. ఈ మేరకు ఆయా అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శనివారం వెల్లడించింది. రెండో ర్యాంకు సాధించిన హర్షితా గోయల్ 1,038 మార్కులు (51.28 శాతం) పొందినట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్