Share News

Beauty Tips. : మేని మెరుపులకు బ్రోకలీ

ABN , Publish Date - Mar 24 , 2025 | 02:02 AM

బ్రోకొలీని తినడం వల్ల శరీరానికి సల్ఫోరాఫేన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, వాపుల నుంచి కాపాడుతుంది. చర్మ కణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్‌పై పోరాడుతుంది.

Beauty Tips. : మేని మెరుపులకు బ్రోకలీ

బ్రోకలీ తింటే ఆరోగ్యానికి మంచిదని తెలుసు. కానీ ఇది చర్మ సంరక్షణకు కూడా ఎంతో తోడ్పడుతుం దని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌...చర్మం మీద ముసలితనం గుర్తులను పోగొట్టి సహజ కాంతితో మెరిసేలా చేస్తాయని అంటున్నారు.

చర్మ ఆరోగ్యానికి...

  • వయసు పెరుగుతున్నప్పుడు సహజంగానే చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది. దీంతో చర్మం కుంచించుకుపోయి ముడతలు ఏర్పడుతుంటాయి. వీటిని నివారించి చర్మం బిగుతుగా మారాలంటే కొల్లాజెన్‌ కావాలి. దీన్ని బ్రోకలీలోని సి విటమిన్‌ ఉత్పత్తి చేస్తుంది. అందుకే రెండు రోజులకు ఒకసారి బ్రోకలీని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

  • బ్రోకొలీని తినడం వల్ల శరీరానికి సల్ఫోరాఫేన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, వాపుల నుంచి కాపాడుతుంది. చర్మ కణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్‌పై పోరాడుతుంది. బయటికి వెళ్లినప్పుడు ఎండలోని అతినీలలోహిత కిరణాల వల్ల చర్మానికి హాని కలగకుండా రక్షణ పొరలను ఏర్పరుస్తుంది.

  • బ్రోకలీని తరచూ తింటూ ఉంటే శరీరానికి కావాల్సినంత ఎ విటమిన్‌ లభిస్తుంది. ఇది చర్మం మీద మృతకణాలను తొలగించి కొత్తవాటిని ఉత్పత్తి చేస్తుంది. చర్మం పొడిబారడాన్ని నివారిస్తుంది. దీంతో చర్మం తేమగా, మృదువుగా ప్రకాశిస్తుంది.


ముఖ సౌందర్యానికి...

  • స్టవ్‌ మీద గిన్నె పెట్టి ఒక కప్పు బ్రోకలీ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. తరవాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి చెంచాతో గుజ్జులా మెదపాలి. ఇందులో ఒక చెంచా తేనె వేసి కలపాలి. ఈ పేస్టుని ముఖమంతా పట్టించాలి. పావుగంటసేపు ఆరిన తరవాత ముఖాన్ని మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖం మీద చర్మం తేమతో నిండి ఛాయగా మెరుస్తుంది. ఈ మిశ్రమంలో తేనెకు బదులు ఒక చెంచా ఓట్‌మీల్‌ వేసి కలిపి ముఖానికి రాస్తే దురద, మంట లాంటివి తగ్గుతాయి.

  • ఒక గిన్నెలో రెండు చెంచాల బ్రోకలీ గింజల నూనె తీసుకోవాలి. దీన్ని వేళ్లతో అద్ది ముఖమంతా రాయాలి. నుదుటి మీద అలాగే కళ్లు, ముక్కు, పెదవుల చుట్టూ ఈ నూనెతో మర్దన చేయాలి. పది నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే ముఖం మీద ముడతలు తగ్గుతాయి.

  • మిక్సీ గిన్నెలో అరకప్పు బ్రోకలీ మొలకలు వేసి ఒక కప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి వడబోసి రసాన్ని సిద్దం చేసుకోవాలి. ఇందులో దూది వుండను ముంచి దానితో ముఖమంతా అద్దాలి. పది నిమిషాలు ఆరాక చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే ముఖంమీద చర్మ రంధ్రాలు శుభ్రమవుతాయి. మొటిమలు, గుల్లలు రావు. మచ్చలు ఏవైనా ఉన్నాకూడా వెంటనే తగ్గిపోతాయి.


  • బ్రోకలీని సాధ్యమైనంత చిన్న ముక్కలుగా తరగాలి. ఒక గిన్నెలో అరకప్పు బ్రోకలీ ముక్కలు, రెండు చెంచాల యోగర్ట్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని ముఖం మీద సున్నితంగా రుద్దాలి. ఇది స్క్రబ్బర్‌లా పనిచేసి ముఖం మీద పేరుకున్న మురికిని తొలగి స్తుంది. ముఖం మృదువుగా ప్రకాశ వంతంగా తయారవుతుంది.

  • ఎండాకాలంలో బయటికి వెళ్లి ఇంటికి రాగానే ముఖం ఎర్రగా కమలడం లేదా నల్లగా మారడం చూస్తూ ఉంటాం. ఇలాంటప్పుడు బ్లెండర్‌లో కొన్ని బ్రోకలీ ముక్కలు, కొన్ని నీళ్లు పోసి బాగా బ్లెండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌ ట్రేలో పోసి ఫ్రీజర్‌లో ఉంచి క్యూబ్స్‌ తయారు చేసుకోవాలి. ఈ క్యూబ్స్‌తో ముఖాన్ని రుద్దితే ఎర్రదనం లేదా నల్లదనం తగ్గి చల్లని అనుభూతి కలుగుతుంది.


ఇవి కూడా చదవండి:

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..


Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 24 , 2025 | 02:02 AM