Share News

Futile to Explain: అది అసాధ్యం

ABN , Publish Date - Apr 18 , 2025 | 12:24 AM

అజ్ఞానులకు ఏ విషయాన్ని చెప్పినా వారు శ్రద్ధగా వినిపిస్తారు కనుక బోధించడం సులభం కానీ కొంత తెలిసి అన్నీ తెలుసునని అహంకారంతో ఉండే వారికి ఏం చెప్పినా వారు అర్థం చేసుకునే స్థితిలో ఉండరు కనుక వారికి బోధించడం అసాధ్యం

Futile to Explain: అది అసాధ్యం

సుభాషితం

తెలియని మనుజుని

దెలుపందగు సుఖతరముగ, తెలుపగ వచ్చుం

దెలిసినవానిం దెలిసియు

తెలియని నరుల దెల్ప బ్రహ్మదేవుని వశమే

భర్తృహరి నీతిశతకంలోని ‘అజ్ఞస్సుఖ మారాధ్య స్సుఖతర...’ అనే ఈ శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవి తెలుగువారికి పద్య రూపంలో ఈ విధంగా అందించారు.

భావం: ఏదీ తెలియని వారికి, జ్ఞానం ఏమాత్రం లేనివారికి ఏ విషయాన్నైనా సులభంగా వివరించవచ్చు. అలాగే తెలివి, జ్ఞానం ఉన్నవారికి కూడా ఆ విషయాన్ని ఇంకా సులువుగా తెలియజేయవచ్చు. కానీ కొంత తెలిసి, మరికొంత తెలియని వారికి... తెలిసింది తక్కువే అయినా అన్నీ తెలుసునని అనుకొనేవారికి బోధించడం బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదు.


ఈ వార్తలు కూడా చదవండి..

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 12:24 AM