Share News

cardamom: జాజి కాయతో...

ABN , Publish Date - Jan 07 , 2025 | 03:59 AM

విత్తనమైన జాజికాయతో పాటు దాని పైపొర జాపత్రిని కూడా వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటాం.

cardamom: జాజి కాయతో...

విత్తనమైన జాజికాయతో పాటు దాని పైపొర జాపత్రిని కూడా వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. అయితే రుచి పెంచడం కోసం ఉపయోగించే ఈ సుగంధద్రవ్యంలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం!

జాజికాయ, క్యాన్సర్‌తో పాటు, క్షీణింపజేసే వ్యాధులు, గుండెజబ్బులను అరికడుతుంది. దీన్లోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్‌తో కణాలు దెబ్బతినకుండా రక్షణ కల్పిస్తాయి. జాజికాయలో ఉండే సయానిడిన్స్‌ అనే యాంటీఆక్సిడెంట్స్‌తో పాటు, ఫినైల్‌ప్రోపనాయిడ్స్‌, టర్పీన్స్‌ అనే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌, ఫినోలిక్‌ సమ్మేళనాలు... ఫ్రీ ర్యాడికల్స్‌ను నిలువరించి, కణ నాశనాన్ని నివారిస్తాయి. అలాగు జాజికాయ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంటుంది. దీన్లోని మోనోటర్పీన్స్‌, సాబీనిన్‌, టర్పినాల్‌, సయానిడీన్స్‌ లాంటి ఫినోలిక్‌ సమ్మేళనాలు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి.

దుష్ప్రభావాలు ఉన్నాయి

గర్భవిచ్ఛిత్తి కారకాలు కలిగి ఉండే జాజికాయకు గర్భిణులు దూరంగా ఉండడమే మేలు. బేక్‌ చేసే వీలున్న పదార్థాలతో పాటు తీపి వంటకాలలో జాజికాయను విరివిగా వాడుతూ ఉంటారు. అయితే జాజికాయతో ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే, దాన్ని పరిమితంగానే వాడుకోవాలి. ఒకసారికి ఒక కిలో శరీర బరువుకు ఒకటి నుంచి రెండు మిల్లీగ్రాముల జాజికాయను వాడుకోవచ్చు. ఐదు గ్రాములకు మించితే విషపూరిత ప్రభావాలకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది.

Updated Date - Jan 07 , 2025 | 03:59 AM