Share News

తాటిబెల్లం తింటే...

ABN , Publish Date - Jan 02 , 2025 | 06:46 AM

తాటిచెట్టు నుంచి లభించే నీరాను ఉడికించి తాటి బెల్లాన్ని తయారు చేస్తారు. ఇది తేనె రంగులో లేదా నల్లగా ఉంటుంది. మనం రోజూ ఉపయోగించే బెల్లం, పంచదారల్లో కంటే తాటి బెల్లంలో పోషకాలు ఎక్కువగా...

తాటిబెల్లం తింటే...

తాటిచెట్టు నుంచి లభించే నీరాను ఉడికించి తాటి బెల్లాన్ని తయారు చేస్తారు. ఇది తేనె రంగులో లేదా నల్లగా ఉంటుంది. మనం రోజూ ఉపయోగించే బెల్లం, పంచదారల్లో కంటే తాటి బెల్లంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో కొవ్వులు, ప్రోటీన్లు అత్యల్పంగాను తేమ, సుక్రోజ్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌, జింక్‌ లాంటివి అత్యధికంగాను ఉంటాయి. చలికాలంలో ప్రతిరోజూ ఒక చెంచా తాటిబెల్లం తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

శీతాకాల సమస్యలకు

  • తాటిబెల్లం తిన్న వెంటనే శరీరంలో వేడి పెరుగుతుంది. దీనివల్ల చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. జలుబు, దగ్గు, ఆస్తమా, మైగ్రేన్‌ సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఒక కప్పు గోరువెచ్చని పాలలో ఒక చెంచా తాటి బెల్లం పొడి, పావు చెంచా మిరియాల పొడి కలుపుకొని తాగితే ముక్కులోని శ్లేష్మం తొలగిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఊపరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. తాటిబెల్లంలోని కాల్షియం, పొటాషియం, భాస్వరం ఎముకలను బలోపేతం చేస్తాయి.


  • మహిళలు నెలసరి సమయంలో తాటిబెల్లం తింటే శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి పొత్తి కడుపు నొప్పి, కాళ్ల తిమ్మిర్లు, కడుపులో వికారం, నీరసం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. తాటిబెల్లంలోని ఐరన్‌ రక్తహీనత రాకుండా కాపాడుతుంది. రక్తంలో హెమోగ్లోబిన్‌ స్థాయిని పెంచుతుంది.

బరువు తగ్గడానికి

ఫ తాటిబెల్లాన్ని తరచూ తింటూ ఉంటే శరీరంలో చేరే వ్యర్థ పదార్థాలన్నీ బయటికి వెళతాయి. శ్వాసకోశం, పేవులు, ఆహారనాళం, జీర్ణాశయం, కాలేయం, రక్తం పరిశుభ్రమవుతాయి. శరీరంలోని అదనపు నీటిని తొలగించి ఎలకో్ట్రలైట్లను సమతుల్యం చేస్తుంది. జీవక్రియలను వేగవంతం చేసి శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది.

జీర్ణక్రియకి

ఫ తాటిబెల్లంలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. దీనివల్ల పేగు కదలికలు సజావుగా జరిగి మలబద్దకం రాకుండా ఉంటుంది. భోజనం తరవాత చిన్న ముక్క తాటిబెల్లం తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తిన్న ఆహారపదార్థాలన్నీ తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. కడుపులో ఆమ్ల తత్వాన్ని నివారిస్తుంది.

చర్మానికి

ఫ చలికాలంలో తాటిబెల్లం తినడం వల్ల చర్మం పొడిబారకుండా తేమతో నిండి ఆరోగ్యంగా కనిపిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచడంవల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు రావు. తాటిబెల్లంలోని గ్లైకోలిక్‌ యాసిడ్‌ చర్మానికి మంచి కాంతిని, నునుపుదనాన్ని అందిస్తుంది. దీనిలోని సి, బి విటమిన్లు చర్మానికి పోషణను అందిస్తాయి.

Updated Date - Jan 02 , 2025 | 06:46 AM