Share News

Teeth Whitening: తెల్లని దంతాలకు...

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:13 AM

తెల్లగా మెరిసే దంతాలు అందంగా కనిపించడమే కాదు నోటి ఆరోగ్యానికి చిహ్నం కూడా.

Teeth Whitening: తెల్లని దంతాలకు...

తెల్లగా మెరిసే దంతాలు అందంగా కనిపించడమే కాదు నోటి ఆరోగ్యానికి చిహ్నం కూడా. సమస్య వచ్చినప్పుడు చాలామంది రసాయనాలతో కూడిన చికిత్సలను ఆశ్రయి స్తుంటారు. వీటివల్ల పళ్ల మీద ఎనామిల్‌ పొర దెబ్బతినే అవకాశం ఉంది. అలాకాకుండా సహజ రీతిలో దంతాలను తెల్లగా మెరిపించే చిట్కాల గురించి తెలుసుకుందాం!

ఆయిల్‌ పుల్లింగ్‌

ఇది ఆయుర్వేద విధానం. నోటిలో రెండు చెంచాల నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె వేసుకుని ఇరవై నిమిషాలపాటు పుక్కిలించి ఆ తరవాత ఉమ్మివేయాలి. తరచూ ఇలా చేస్తుంటే నోటిలోని హానికారక సూక్ష్మజీవులు నశించిపోతాయి. నోటి కండరాలు బలోపేతమవుతాయి. చిగుళ్లకు రక్త ప్రసరణ జరుగుతుంది. దంతాలమీద పేరుకున్న పాచి, ఇతర పదార్థాల అవశేషాలు క్రమంగా కరిగిపోతాయి.

వేప పుల్ల...

లావుగా ఉండే వేప పుల్లను తీసుకొని దాని కొనను నమిలి బ్రష్‌లా చేయాలి. ఇలా నములుతున్నపుడు నోటిలో ఊరే లాలాజలాన్ని ఉమ్మివేయాలి. చిగుళ్లను, దంతాలను మెల్లగా తోమాలి. వేప పుల్ల నుంచి వెలువడే యాంటీ బ్యాక్టీరియల్‌ దంతాలపై పేరుకున్న పాచిని తొలగిస్తుంది. ఇలా రోజూ చేస్తూ ఉంటే దంతాలు తెల్లగా ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన, దంతక్షయం లాంటి సమస్యలు రావు.

Updated Date - Jan 04 , 2025 | 04:13 AM