Share News

Children's Nutrition : పిల్లల ఎదుగుదలకు...

ABN , Publish Date - Jan 12 , 2025 | 06:09 AM

పిల్లల శారీరక ఎదుగుదలకు, మానసిక వికాసానికి పోషకాహారం తప్పనిసరి. పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే ఏం తినిపించాలో తెలుసుకుందాం!

Children's Nutrition : పిల్లల ఎదుగుదలకు...

పిల్లల శారీరక ఎదుగుదలకు, మానసిక వికాసానికి పోషకాహారం తప్పనిసరి. పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే ఏం తినిపించాలో తెలుసుకుందాం!

పాలు: ప్రతిరోజూ పిల్లలకు కనీసం రెండు గ్లాసుల పాలు తాగించాలి. పాలతో తయారయ్యే పెరుగు, జున్ను లాంటివి కూడా తినిపించాలి. వీటిలో కాల్షియం, ప్రోటీన్లు, మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవన్నీ పిల్లల్లో దంతాలు, ఎముకలు, కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి. పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చేస్తాయి. రక్తపోటు, గుండె పనితీరు నియంత్రణలో ఉండేలా సహకరిస్తాయి.

ప్రొటీన్‌ పదార్థాలు: ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను పిల్లలకు పెట్టాలి. గుడ్లు, మాంసం, చేపలు, నట్‌ బటర్‌, బాదం, బీన్స్‌, బఠానీలు, సోయా పన్నీర్‌లను అల్పాహారంలో చేర్చి తినిపించాలి. దీనివల్ల పిల్లలకు అవసరమైన ప్రోటీన్లు, పీచుపదార్థాలు అంది మెదడు, కణజాలం వృద్ది చెందుతాయి.

పండ్లు: పిల్లలకు తరచూ పండ్లను తినిపించడం వల్ల వారి ఎదుగుదలకు కావాల్సిన విటమిన్లు, ఖనిజ లవణాలు, ఇతర పోషకాలు అందుతాయి. నారింజ, స్ట్రాబెరీ లాంటి సిట్రస్‌ జాతి పండ్లను తినిపిస్తే పిల్లలకు సి విటమిన్‌ లభిస్తుంది. ఇది వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాపిల్స్‌, అరటి పండ్లు తినిపించడం వల్ల యాంటీఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు, పొటాషియం లభిస్తాయి. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.


తృణ ధాన్యాలు: బ్రౌన్‌ బ్రెడ్‌, టోర్టిల్లా, ఫ్లాట్‌ బ్రెడ్‌, పాస్తా, నూడుల్స్‌ను పిల్లలకు తినిపించాలి. బియ్యం, మొక్క జొన్న, క్వినోవా, ఓట్స్‌, బార్లీ లాంటి ధాన్యాలతో తయారు చేసిన వంటకాలను పిల్లలకు పెట్టాలి. దీనివల్ల వారికి శక్తి లభిస్తుంది. జీవక్రియలు వేగవంతమై పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు.

కూరగాయలు: టమాటా, కేరెట్‌, చిలగడదుంప, గుమ్మడికాయ, బీట్‌రూట్‌ లాంటి తాజా కూరగాయలను పిల్లలకు తప్పకుండా తినిపించాలి. వీటిలో ఎ విటమిన్‌, ఖనిజాలు, పీచుపదార్థం, ఫైటోకెమికల్స్‌, బీటా కెరోటిన్లు, కెరోటినాయిడ్స్‌ ఉంటాయి. ఇవి పిల్లల శారీరక నిర్మాణానికి సహకరిస్తాయి. కళ్లు, చర్మం, తల వెంట్రుకలు, గోళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

Updated Date - Jan 12 , 2025 | 06:09 AM