Relationship Tips: ఈ 5 సంకేతాలు విడాకులకు దారితీస్తాయి..
ABN , Publish Date - Jan 09 , 2025 | 05:07 PM
ఇటీవల కాలంలో విడాకులు సర్వసాధారణం అయ్యాయి. అయితే, ఈ 5 సంకేతాలు వివాహ బంధం విఫలం అయ్యేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు. అవెంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
వివాహం అనేది ఒక బంధం. ప్రేమ, నమ్మకం, అంకితభావం వంటివి ఈ బంధానికి ఎంతో అవసరం. కానీ, కొన్ని పరిస్థితులు ఈ సంబంధం విచ్ఛిన్నం అయ్యేలా చేస్తాయి. ఈ బంధంలో చిన్న చిన్న వాదనలు, విభేదాలు సాధారణం. అయితే, ఈ 5 సంకేతాలు మీ వివాహ బంధంలో కనిపిస్తే, మీరు దానిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే విడాకులకు దారి తీస్తాయి. ఆ 5 సంకేతాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
1. నిరంతరం తగాదాలు:
మీ దాంపత్యంలో ప్రతి చిన్న విషయం గొడవలకు దారితీస్తే అది ఆందోళన కలిగించే విషయం. తగాదాలు ఎక్కువ అయినప్పుడు, భాగస్వాములిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోకుండా నిందించుకోవడం ప్రారంభించినప్పుడు, వివాహ సంబంధం చెడిపోతుందనడానికి సంకేతం.
2. కమ్యూనికేషన్ లేనప్పుడు:
మంచి సంబంధానికి పునాది కమ్యూనికేషన్. మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడకుండా సిగ్గుపడటం లేదా సంభాషణల సమయంలో నటిస్తూ ఉంటే, ఇది సంబంధంలో చీలికకు పెద్ద సంకేతం.
3. ట్రస్ట్ లేకపోవడం:
సంబంధంలో అత్యంత ముఖ్యమైన అంశం నమ్మకం. ఒకరిపై ఒకరికి ట్రస్ట్ లేకపోతే ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగదు. అనుమానంను తేలిగ్గా తీసుకోకండి. ఇది విడాకులకు దారితీస్తుంది.
4. ఎమోషనల్, ఫిజికల్ దూరం:
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక దూరం పెరగడం ప్రారంభించి, మీరు ఒకరితో ఒకరు సమయం గడపడం మానుకుంటే, అది సంబంధం బలహీనపడటానికి పెద్ద సంకేతం.
5. మీ భవిష్యత్ ప్రణాళికలో మీ భాగస్వామిని చేర్చుకోవడం మర్చిపోవడం లేదా ఉద్దేశపూర్వకంగా వారికి చోటు కల్పించకపోవడం ప్రారంభించినప్పుడు, ఈ సంబంధం ముగింపు దిశగా సాగుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)