Skin Care: తైలంతో తరగని అందం
ABN , Publish Date - Mar 23 , 2025 | 03:59 AM
సౌందర్య చికిత్సల్లో తైలాలది ప్రత్యేక స్థానం. ఏ తైలాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకుని మసలుకుంటే, తరగని అందాన్ని సొంతం చేసుకోవచ్చు.

సౌందర్య చికిత్సల్లో తైలాలది ప్రత్యేక స్థానం. ఏ తైలాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకుని మసలుకుంటే, తరగని అందాన్ని సొంతం చేసుకోవచ్చు.
గ్రీన్ టీ ఆయిల్: గ్రీన్ టీ ఆకులు, ఆలివ్ ఆయిల్‌ను ఒక జాడీలో వేసుకుని, ఎండచొరబడని, చల్లని ప్రదేశంలో నెల రోజుల పాటు ఉంచితే, గ్రీన్ టీ ఆయిల్ సిద్ధమవుతుంది. ఈ నూనె వెంట్రుకలకు తేమను అందించి, మృదువుగా మార్చి, ఆరోగ్యమైన పెరుగుదలకు తోడ్పడుతుంది. పొడి చర్మం తేమ సంతరించుకోవాలంటే గ్రీన్ టీ నూనెను ముఖానికి పూసుకుని మర్దన చేయాలి.
పసుపు నూనె: కొబ్బరి నూనెకు పసుపు ముద్దను కలిపి, చిన్న మంట మీద ఉడికించాలి. చల్లారిన తర్వాత సీసాలో నిల్వ చేసుకుని ఉపయోగించుకోవాలి. ఈ నూనెతో ముఖం మీద మచ్చలు మటుమాయమవుతాయి. మంగు మచ్చలు కూడా తొలగిపోతాయి. వయసు పైబడే ఛాయలు అదుపులోకి వస్తాయి. నల్లబడిన పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.
క్యారట్ ఆయిల్: నచ్చిన నూనెలో క్యారెట్ ముక్కలను వేసి, నూనె రంగు మారే వరకూ చిన్న మంట మీద ఉడికించి, చల్లార్చి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె కుదుళ్లకు పూసుకుంటే వెంట్రుకలు పెరుగుతాయి. ఎండకు దెబ్బతిన్న, కమిలిన చర్మం తిరిగి జీవం సంతరించుకోవాలంటే ఈ నూనెను అప్లై చేసుకోవాలి.
కాఫీ ఆయిల్: కొబ్బరినూనెలో కాఫీ పొడి కలిపి, చిన్న మంట మీద ఉడికించాలి. తర్వాత వడగట్టి వాడుకోవచ్చు. ఈ నూనెను వెంట్రుకలకు పూసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కళ్ల కింద నలుపు తగ్గడం కోసం రాత్రి నిద్రకు ముందు ఈ నూనును కళ్ల దిగువన అప్లై చేసుకోవాలి. అలాగే స్ట్రెచ్ మార్క్స్‌ను వదిలించడం కోసం ఆయా ప్రదేశాల్లో ఈ నూనె అప్లై చేసి మర్దన చేయాలి.
ఇవి కూడా చదవండి..
IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే
IPL 2025: బిగ్ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం.