Share News

Green Tea : గ్రీన్‌ టీ తాగుతున్నారా..!

ABN , Publish Date - Jan 12 , 2025 | 06:05 AM

బ్లాక్‌ టీ కంటే గ్రీన్‌ టీ తాగడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు వేడినీళ్లలో ఓ గ్రీన్‌ టీ బ్యాగ్‌ లేదా కొన్ని గ్రీన్‌ టీ ఆకులు, రెండు పుదీనా లేదా తులసి ఆకులు వేసి మూతపెట్టి రెండు నిమిషాలు

Green Tea : గ్రీన్‌ టీ తాగుతున్నారా..!

బ్లాక్‌ టీ కంటే గ్రీన్‌ టీ తాగడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు వేడినీళ్లలో ఓ గ్రీన్‌ టీ బ్యాగ్‌ లేదా కొన్ని గ్రీన్‌ టీ ఆకులు, రెండు పుదీనా లేదా తులసి ఆకులు వేసి మూతపెట్టి రెండు నిమిషాలు అలాగే ఉంచాలి. తరవాత ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనె కలిపితే గ్రీన్‌ టీ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!


  • పని ఒత్తిడితో అలసిపోయినపుడు ఓ కప్పు గ్రీన్‌ టీ తాగితే దానిలోని థయమిన్‌ సమ్మేళనం ప్రభావవంతంగా పనిచేసి ఆందోళనను తగ్గిస్తుంది. మధుమేహం, రక్తపోటు సమస్యలను నివారిస్తుంది.

  • తరచూ గ్రీన్‌ టీ తాగడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. న్యూరోడీజెనరేటివ్‌ సమస్యలు రావు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలను పెంచి అల్జీమర్స్‌, పార్కిన్సన్స్‌ వ్యాధులను అరికడుతుంది.

  • ప్రతిరోజూ ఉదయాన్నే గ్రీన్‌ టీ తాగుతూ ఉంటే ఎముకలు, కీళ్లు బలోపేతమవుతాయి. ఆస్టియోపొరాసిస్‌ వ్యాధి రాదు.

  • గ్రీన్‌ టీలోని పాలి ఫెనాల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు... చర్మాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి. కళ్ల కింద, చర్మం మీద ముడతలు రాకుండా చేస్తాయి. శిరోజాల కుదుళ్లు గట్టిపడేలా సహకరిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి.

  • రోజుకు రెండుసార్లు గ్రీన్‌ టీ తాగుతూ ఉంటే దానిలోని కెటాచిన్లు... శరీరంలోని అదనపు కేలరీలను వేగంగా కరిగిస్తాయి. దీంతో శరీర బరువు క్రమంగా తగ్గుతుంది.

  • తేనె, పంచదార కలుపుకోకుండా గ్రీన్‌ టీ తాగితే అందులోని యాంటీ బ్యాక్టీరియల్స్‌.... దంతక్షయం, చిగుళ్ల వ్యాధులు, నోటి దుర్వాసన, నోటి క్యాన్సర్‌ లాంటి సమస్యలను నివారిస్తాయి.

Updated Date - Jan 12 , 2025 | 06:05 AM