Share News

Traditional Fashion: షరారా శారీతో స్టయిల్‌గా

ABN , Publish Date - Jan 08 , 2025 | 04:19 AM

ఒకవైపు సంప్రదాయం మరోవైపు ఆధునికత కలగలసి ఈ తరం అమ్మాయిల మనసు దోచుకుంటోంది ‘షరారా శారీ’.

Traditional Fashion: షరారా శారీతో స్టయిల్‌గా

ఒకవైపు సంప్రదాయం మరోవైపు ఆధునికత కలగలసి ఈ తరం అమ్మాయిల మనసు దోచుకుంటోంది ‘షరారా శారీ’. టాప్‌గా షార్ట్‌ కుర్తీ... బాటమ్‌గా షరారా ప్యాంట్‌... జతగా అందమైన దుపట్టాతో అన్ని వర్గాలవారిని ఆకర్షిస్తోంది. సంప్రదాయ చీరకట్టుని తలపిస్తూ స్టయిలిష్‌ లుక్‌లో హుందాగా అమ్మాయిలను కట్టిపడేస్తోందీ లక్నో డ్రెస్‌. పండుగలు, వేడుకలు, పార్టీలు ఇలా ఏ సందర్భమైనా యువతుల మొదటి ఎంపిక షరారా శారీనే!

సంప్రదాయ పండుగలకు ఎరుపు, పసుపు రంగుల డ్రెస్‌లు బాగుంటాయి. దుపట్టాను ఓణీలా వేసుకోవచ్చు. చీర కట్టుకోవడం, లంగా-ఓణీ వేసుకోవడం ఇబ్బంది అనుకునేవారికి ఈ షరారా శారీ సౌకర్యవంతంగా ఉంటుంది.

టాప్‌గా షార్ట్‌ కుర్తా వేసుకుంటే ఒక స్టైల్‌, అదే ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ వేసుకుంటే మరో స్టైల్‌లో కనిపించవచ్చు. వివాహాది వేడుకలకు ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌, సంప్రదాయ ఆభరణాలు ధరిస్తే అందంగా కనిపిస్తారు.

సాయంకాలపు పార్టీలకు ఫ్లోరల్‌, టాప్‌ టు బాటమ్‌ ఒకే రంగు ఉన్న డ్రెస్‌లు బాగుంటాయి. వీటికి ఆభరణాల అవసరం ఉండదు. సాధారణంగా కనిపిస్తూనే దర్పాన్ని ఒలకబోస్తుందీ డ్రెస్‌

షరారా.... ప్యాంట్‌లా ఉంటే సింపుల్‌గా కనిపిస్తుంది. అదే కుచ్చులు జతచేస్తే స్టయిలిష్‌ లుక్‌ వస్తుంది. ఎన్ని ఎక్కువ కుచ్చులు పెడితే అంత గ్రాండ్‌గా కనిపిస్తుంది. షరారాకు బెల్ట్‌ అదనపు ఆకర్షణ

Updated Date - Jan 08 , 2025 | 04:19 AM