Share News

OTT: ఈ వారమే విడుదల

ABN , Publish Date - Jan 05 , 2025 | 01:47 AM

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

OTT: ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

చెరసాల చెప్పిన కథ

జైల్‌ పాలిటిక్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన హిందీ సిరీస్‌ ‘బ్లాక్‌ వారెంట్‌’. సునీల్‌ గుప్తా, సునేత్రా చౌధురి రాసిన ‘బ్లాక్‌వారెంట్‌: ఏ కన్ఫెషన్స్‌ ఆఫ్‌ ఏ తీహార్‌ జైలర్‌’ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్‌ తెరకెక్కించారు. బాలీవుడ్‌ నటదిగ్గజం శశికపూర్‌ మనవడు జహన్‌ కపూర్‌ హీరోగా నటించాడు. ‘తీహార్‌ జైలుకు కొత్త జైలర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అతను పై నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొన్నాడు, జైలు సిబ్బంది, నేరస్తులు పన్నిన కుట్రలను ఎలా ఛేదించాడు, తీహార్‌ జైలు నిర్వహణను రాజకీయాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి లాంటి వెలుగులోని రాని పలు అంశాలను ఈ సిరీ్‌సలో ఆవిష్కరిస్తున్నాం’ అని దర్శకుడు చెప్పారు.

juk.jpg

Updated Date - Jan 05 , 2025 | 01:47 AM