Share News

Daaku Maharaj: బే ఏరియాలో ‘డాకూ మహారాజ్' ఫీవర్.. బాలయ్య ఫ్యాన్స్ హంగామా!

ABN , Publish Date - Jan 12 , 2025 | 03:52 PM

అమెరికాలోని బే ఏరియాలో ‘డాకూ మహారాజ్’ ఫివర్ వైరల్‌‌గా మారింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో బాలయ్య ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

Daaku Maharaj: బే ఏరియాలో ‘డాకూ మహారాజ్' ఫీవర్.. బాలయ్య ఫ్యాన్స్ హంగామా!

మాస్ కా బాప్ 'నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి ల కాంబోలో తెరకెక్కిన డాకూ మహారాజ్ మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రిలీజ్ అయింది. బాలయ్య కెరీర్‌లోని అత్యధిక స్క్రీన్స్‌లో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ హిట్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా చూసిన బాలయ్య ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. బాలయ్య, బాబీ కాంబోలో బంపర్ హిట్ దక్కిందని తీన్ మార్ డ్యాన్స్ చేస్తున్నారు (NRI).

NRI: సౌదీలో సాటా ఆధ్వర్యంలో పండుగ సందడి

1.jpg


ఇక, అమెరికాలోని బే ఏరియాలో ‘డాకూ మహారాజ్’ ఫివర్ వైరల్‌‌గా మారింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో బాలయ్య ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. అఖండకు ఎన్నారైలు బ్రహ్మరథం పట్టారు. బాలయ్య మంచి మాస్ హిట్ అందుకున్నారని వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘డాకూ మహారాజ్’ ఇచ్చిన కిక్ తో అక్కడి బాలయ్య అభిమానులు, ఎన్నారైలు బే ఏరియాలో సంబరాల్లో మునిగిపోయారు. మాస్ కా బాప్ బాలయ్య ఎప్పటిలాగే తన నట విశ్వరూపం చూపించి హోల్ అండ్ సోల్ పర్‌ఫార్‌మెన్స్‌తో ఇరగదీశారు. నందమూరి బాలకృష్ణ డైలాగ్స్‌కు బాబీ ఎలివేషన్ కలిపి థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలేనట.

New Zealand Visa Rules: కార్మికుల కొరత.. న్యూజిలాండ్ వీసా నిబంధనల్లో కీలక మార్పులు

3.jpg


సివర్ స్క్రీన్ మావెరిక్స్ టీమ్ సభ్యులు సత్య మల్లిరెడ్డి, గంగా కోమటి, ఉదయ్ కిరణ్ సిస్టా, మూర్తి అయ్యగారి, అరవింద్ ముసునూరి, రత్నకుమార్, ధీరేందర్ సింగ్, భాగ్యరాజ్ గుర్రం, బాలయ్య అభిమానులు శ్రీకాంత్ దొడ్డపనేని, సాయి కంభంపాటి, అజయ్ యార్లగడ్డ, భక్త బల్ల, వెంకట్ అడుసుమల్లి ఆధ్వర్యంలో ‘డాకూ మహారాజ్’ సంబరాలు అంబరాన్నంటాయి.

Read Latest and NRI News

Updated Date - Jan 12 , 2025 | 04:15 PM