Share News

Jagdeep Singh: ప్రపంచంలో అత్యధిక శాలరీ తీసుకుంటున్న ఉద్యోగి మనోడే! శాలరీ ఎంతో తెలిస్తే..

ABN , Publish Date - Jan 05 , 2025 | 03:35 PM

ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందుతున్న ఉద్యోగిగా ఓ భారత సంతతి వ్యక్తి ఇటీవల పతాకశీర్షికల్లో నిలిచాడు. రోజుకు ఏకంగా రూ.48 కోట్లు తీసుకుంటున్న ఆయన పేరు జగ్‌దీప్ సింగ్.

Jagdeep Singh: ప్రపంచంలో అత్యధిక శాలరీ తీసుకుంటున్న ఉద్యోగి మనోడే! శాలరీ ఎంతో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: కార్పొరేట్ సంస్కృతి వేళ్లూనుకున్న నేటి జమానాలో కంపెనీల లాభాలు, ఉద్యోగుల జీతనాతాలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందుతున్న ఉద్యోగిగా ఓ భారత సంతతి వ్యక్తి ఇటీవల మీడియాలో పతాకశీర్షికల్లో నిలిచారు. రోజుకు ఏకంగా రూ.48 కోట్లు తీసుకుంటున్న ఆయన పేరు జగ్‌దీప్ సింగ్. ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి సంస్థ క్వాంటమ్ స్కేప్ వ్యవస్థాపించిన జగదీప్ పారితోషికం నేక కంపెనీ వార్షిక ఆదాయం కంటే ఎక్కువ. క్వాంటమ్‌స్కేప్ స్టాక్ ఆప్షన్స్ కూడా కలుపుకుంటే జగదీప్ వార్షిక పారితోషికం ఏకంగా రూ.17800 కోట్లు (Viral).

Viral: వామ్మో.. పులి పిల్లల వేట.. షాకింగ్ వీడియో!


ఎవరీ జగ్‌దీప్ సింగ్

జగ్‌దీప్ సింగ్ స్టాఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ చేశారు. ఆ తరువాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఎమ్‌టెక్ చేశారు. కెరీర్ తొలి నాళ్లల్లో ఆయన హెచ్‌పీ, సన్ మైక్రోసిస్టమ్స్‌ లాంటి ప్రముఖ టెక్ కంపెనీల్లో పనిచేశారు. ఆ అనుభవంతో సొంతంగా పలు అంకుర సంస్థలను కూడా నెలకొల్పారు. 1992లో తొలిసారిగా ఎయిర్‌సాఫ్ట్ పేరిట ఓ స్టార్టప్ సంస్థను నెలకొల్పారు.

దశాబ్దకాలంలో వివిధ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసిన అనుభవంతో ఆయన 2010లో క్వాంటమ్ స్కేప్ అనే సంస్థను నెలకొల్పారు. బ్యాటరీ సాంకేతితలో సరికొత్త ఆవిష్కరణల కోసం క్వాంటమ్‌ స్కేప్ విస్తృతస్థాయిలో పనిచేస్తోంది.

ప్రస్తుత విద్యుత్ బ్యాటరీలల్లో కొన్ని ప్రతికూలతలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేందుకు ఇవి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ఒక్క చార్జికి స్వల్ప దూరమే వెళ్లడం, త్వరితంగా బ్యాటరీ అయిపోవడం వంటి భయాల కారణంగా జనాలు సంప్రదాయిక ఇంధన వాహనాలను వదులుకోలేకపోతున్నారు. ఈ సమస్యలు చెక్ పెట్టేందుకు క్వాంటమ్ స్కేప్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ అభివృద్ధికి నడుం కట్టింది.


సంద్రాయిక లీథియమ్ అయాన్ బ్యాటరీలకంటే భిన్నమైన సాలిడ్ స్టేట్ బ్యాటరీలు త్వరగా చార్జి అవుతాయి. బ్యాటరీల్లో చార్జింగ్ ఎక్కువ సమయం నిలిచుండటమే కాకుండా వీటిల్లో శక్తి సాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. బ్యాటరీ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులకు ప్రయత్నిస్తున్న క్వాంటమ్ స్కే్ప్‌‌కు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫోక్స్‌వ్యాగన్ వంటి పెట్టుబడి దారులు అండగా ఉన్నారు. క్వాంటమ్ స్కేప్ సీఈఓ బాధ్యతల నుంచి ఆయన గతేడాదే పక్కకు తప్పుకున్నారు. ప్రస్తుతం శివ శివరామ్ సంస్థ పగ్గాలను చేపట్టారు. అయితే, జగ్‌దీప్ మాత్రం బోర్డు చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

Read Latest and NRI News

Updated Date - Jan 05 , 2025 | 03:39 PM