Share News

NRI: లండన్‌‌లో రియల్ ఎస్టేట్‌ ఆస్తులున్న వర్గాల్లో భారత సంతతి వారే టాప్!

ABN , Publish Date - Jan 02 , 2025 | 03:51 PM

లండన్‌లో రియల్ ఎస్టేట్ ఆస్తులున్న వర్గాల్లో భారత సంతతి వారు నెం.1గా నిలిచారు. ఆ తరువాతి స్థానాల్లో బ్రిటిషర్లు, పాకిస్థానీలు ఉన్నారు.

NRI: లండన్‌‌లో రియల్ ఎస్టేట్‌ ఆస్తులున్న వర్గాల్లో భారత సంతతి వారే టాప్!

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై దాదాపు 200 ఏళ్ల పాటు ఆధిపత్యం చలాయించిన బ్రిటన్ రాజ్యం ఇక్కడి సరిసంపదలను దోచుకుపోయింది. అయితే, ఇప్పుడు కాలం తిరగబడింది. బ్రిటన్‌ రాజధాని లండన్‌లో ఇప్పుడు భారత సంతతి వారు హవా సాగుతోంది. అక్కడ రియల్ ఎస్టేట్ ఆస్తులు కలిగిన వర్గాల్లో భారత సంతతి వారు టాప్‌లో నిలిచారు. కొన్ని తరాలుగా అక్కడ నివసిస్తున్న భారత సంతతి వారితో పాటు, ఎన్నారైలు, భారతీయ ఇన్వెస్టర్లు, విద్య కోసం బ్రిటన్ వెళ్లిన వాళ్లల్లో అనేక మంది అక్కడి రియల్ ఎస్టే్ట్ ఆస్తులను కొనుగోలు చేశారట. లండన్‌లో రియల్ ఆస్తులున్న వర్గా్ల్లో తొలి స్థానం భారత సంతతి వారిది కాగా ఆ తరువాతి స్థానాల్లో బ్రిటన్ జనాలు, పాకిస్థానీలు ఉన్నారట. బారెట్ లండన్ అనే సంస్థ ఈ విషయాలను వెల్లడించింది (NRI).

TANA: తానా ఆధ్వర్యంలో ఘనంగా 75వ అంతర్జాతీయ అంతర్జాల సదస్సు..


ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టంట హాట్ టాపిక్‌గా మారింది. భారతీయుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. చట్టపరంగానే మనోళ్లు ఇంగ్లిష్ జనాల్ని అధిగమించారు. ఖర్మ అంటే ఇదేనేమో అని ఓవ్యక్తి కామెంట్ చేశారు. బ్రిటీష్ మ్యూజియంలోని వస్తువుల్లో 90 శాతం భారత్ నుంచి దొంగిలించినవే అని కొందరు చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ప్రపంచంలో సగం వారి సొంతమైంది. ఇప్పుడు లండన్‌లో సగం కూడా వారి చేతుల్లో లేదని మరో వ్యక్తి సెటైర్ పేల్చాడు. ‘‘200 ఏళ్ల పాటు అన్యాయంగా ఇంగ్లిష్ జనాలు భారత్‌ను ఆక్రమిస్తే భారతీయులు న్యాయంగానే అక్కడి రియల్ ఆస్తులను సొంతం చేసుకున్నారు. ఇక నివేదిక ప్రకారం, బ్రిటన్‌లో భారత సంతతి వారు 1 నుంచి బెడ్‌ రూమ్‌లు ఉన్న ఇళ్లపై ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు.

Saudi Arabia: కన్న కూతురిని చూడడానికి ఏడేళ్ల పాటు నిరీక్షణ.. తెలుగు ప్రవాసీకి ఎట్టకేలకు ఊరట


భారత్‌లో 1757లో తొలిసారిగా ఈస్ట్ ఇండియా పాలన మొదలైన విషయం తెలిసిందే. 1858లో సిపాయి తిరుగుబాటు తరువాత పాలన బ్రిటన్ రాజవంశం చేతుల్లోకి వెళ్లింది. ఆ తరువాత 1947లో భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. అలా దాదాపు 200 ఏళ్ల పాటు బ్రిటన్ పట్టు కొనసాగింది.

2021 సెన్సెస్ ప్రకారం, ఇంగ్లండ్ అండ్ వేల్స్‌లో భారత సంతతి వారి మొత్తం జనాభా 18,64,318. అక్కడి మైనారిటీల్లో అతిపెద్ద వర్గంగా భారత సంతతి వారు నిలిచారు. ఇక లండన్‌లో సుమారు 6.56 లక్షల మంది భారతీయులు ఉన్నారట. గ్రేటర్ లండన్ జనాభాలో వీరి వాటా సుమారు 7.5 శాతం.

Read Latest and NRI News

Updated Date - Jan 02 , 2025 | 04:46 PM