Share News

New Zealand Visa Rules: కార్మికుల కొరత.. న్యూజిలాండ్ వీసా నిబంధనల్లో కీలక మార్పులు

ABN , Publish Date - Jan 05 , 2025 | 05:09 PM

దేశంలో కార్మికుల కొరతను అధిగమించేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం వీసా నిబంధనలను సరళీకరించింది. పని అనుభవం, జీతనాతాలకు సంబంధించిన రూల్స్‌ను మరింతగా సడలిస్తూ విదేశీయులకు వెల్‌కమ్ చెబుతోంది.

New Zealand Visa Rules: కార్మికుల కొరత.. న్యూజిలాండ్ వీసా నిబంధనల్లో కీలక మార్పులు

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌లో సెటిలవ్వాలనుకుంటున్న భారతీయులకు గుడ్ న్యూస్. దేశంలో కార్మికుల కొరతను అధిగమించేందుకు అక్కడి ప్రభుత్వం పలు వీసాల నిబంధనలను మరింత సరళతరం చేసింది. పని అనుభవం, జీతాలు, వీసా కాలపరిమితికి సంబంధించి కీలక మార్పులను ప్రకటించింది (NRI).

వీసా మంజూరు చేసేందుకు విదేశీ ఉద్యోగుల పని అనుభవాన్ని మూడు నుంచి రెండు సంవత్సరాలకు కుదించింది. దీంతో, అక్కడి సంస్థలకు మరింత సులువుగా విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అవకాశం లభించినట్టైంది. అంతేకాకుండా, విదేశీ సీజనల్ వర్కర్ల రాకను మరింతగా ప్రోత్సహించేందుకు కొత్త వీసాలను ప్రకటించింది. అనుభవజ్ఞులైన సీజనల్ వర్కర్లు మూడేళ్ల కాలపరిమితిపై పలుమార్లు న్యూజిలాండ్ వచ్చి వెళ్లేందుకు వీలుగా మల్టీ ఎంట్రీ వీసాతో పాటు లో స్కిల్డ్ వర్కర్ల కోసం ఏడు నెలల కాలపరిమితిపై సింగిల్ ఎంట్రీ వీసాను ప్రకటించింది.


Jagdeep Singh: ప్రపంచంలో అత్యధిక శాలరీ తీసుకుంటున్న ఉద్యోగి మనోడే! శాలరీ ఎంతో తెలిస్తే..

వీటితో పాటు న్యూజిలాండ్ సంస్థలు విదేశీ ఉద్యోగులకు ఇచ్చే జీతనాతాల రూల్స్‌ను కూడా సరళీకరించింది. తాజా నిబంధన ప్రకారం, ఎక్రిడిటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా, స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసాల లబ్ధిదారులకు జీతాలను కంపెనీలు మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించవచ్చు. అయితే, తమ పిల్లల్ని వెంట తీసుకురావాలనుకుంటున్న వీదేశీ ఉద్యోగుల కనీస జీతాన్ని మాత్రం యథాతథంగా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఉద్యోగాల భర్తీలో స్థానికుల ప్రాధాన్యమిచ్చేలా 21 రోజుల పాటు ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలన్న నిబంధనను కూడా ప్రభుత్వం సరళీకరించింది. తాజా నిబంధనల ప్రకారం ఇకపై కేవలం ప్రకటనలు ఇచ్చి, స్థానికులను ఇంటర్వ్యూ చేసి కంపెనీలు తమ నిజాయితీని చాటుకుంటే సరిపోతుంది.


NRI: లండన్‌‌లో రియల్ ఎస్టేట్‌ ఆస్తులున్న వర్గాల్లో భారత సంతతి వారే టాప్!

కంపెనీలు స్థానికులకు 35 శాతం ఉద్యోగాలు కల్పించాలన్న నిబంధనను కూడా సవరించింది. పరిమితిని 15 శాతానికి కుదిస్తూ విదేశీ ఉద్యోగులకు దేశం తలుపులు బార్లా తెరిచింది. ఇక స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసాకు మారాలనుకుంటున్న విదేశీయులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మధ్యంతర ఉపాధి హక్కులు కూడా అందుతాయి. అంతేకాకుండా, పోస్ట్ స్టడీ వర్క్ వీసా గల వారు దేశంలో మూడేళ్ల వరకూ ఉపాధి పొందే అవకాశఆం ఇచ్చింది. ఇది భారతీయులకు ఉపయోగకరమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Read Latest and NRI News

Updated Date - Jan 05 , 2025 | 05:09 PM