Viral Video: బాబూ.. ఇదేం పని.. ఈ వ్యక్తి రైల్లో ఏం చేస్తున్నాడో చూడండి.. సీట్ కవర్లను చింపేస్తూ..
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:25 PM
ఇండియన్ రైల్వే ప్రతిరోజు కొన్ని కోట్ల మందిని గమ్య స్థానాలకు చేర్చుతోంది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఉన్నంతలో చాలా పక్కగా రైల్వే వ్యవస్థను పక్కగా నడిపిస్తోంది. అయితే కొందరు చేసే పనుల వల్ల ఇండియన్ రైల్వే తీవ్ర ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కొంటోంది.
ప్రపంచంలోనే అతి పెద్దవైన రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే (Indian Railway) ఒకటి. ఇండియన్ రైల్వే ప్రతిరోజు కొన్ని కోట్ల మందిని గమ్య స్థానాలకు చేర్చుతోంది. లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఉన్నంతలో చాలా పక్కగా రైల్వే వ్యవస్థను పక్కగా నడిపిస్తోంది. అయితే కొందరు చేసే పనుల వల్ల ఇండియన్ రైల్వే తీవ్ర ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే సదరు వ్యక్తిపై ఆగ్రహం కలగకమానదు. ఆ వీడియో క్షణాల్లోనే నెట్టింట్ వైరల్‌గా మారింది. @MrSinha_ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ వీడియోను పంచుకున్నాడు (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వేగంగా వెళుతున్న ఓ రైల్లో (Train) ఖాళీగా ఉన్న కంపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తి విధ్వంసానికి పాల్పడుతున్నాడు. సీటు కవర్ (Train Seat) మొత్తాన్ని చించేసి బయటకు పారేశాడు. అలాగే పై బెర్త్ నుంచి ప్లాస్టిక్ వస్తువును కూడా విరిచేసి బయటకు పారేశాడు. అదంతా అతడు ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అందులో అతడి ప్రయోజనం ఏంటో చాలా మందికి అర్థం కావడం లేదు. కేవలం వీడియో కోసమే అతడు రైల్లో విధ్వంసానికి పాల్పడుతున్నట్టు చాలా మంది అనుమానిస్తున్నారు. అయితే ఆ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ వీడియోను చాలా మంది రీ ట్వీట్ చేస్తున్నారు.
ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని బీహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందిన మహ్మద్ సమీర్‌గా గుర్తించారు. అతడిపై చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 17 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 12 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. అలాంటి వాడికి కచ్చితంగా శిక్ష పడాలని కామెంట్లు చేస్తున్నారు. అలాంటి విధ్వంసానికి పాల్పడిన ఆ వ్యక్తి.. మళ్లీ రైల్వే వ్యవస్థను విమర్శిస్తాడని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Test: పాపం.. ఈమెకు తన భర్త కనబడడం లేదు.. 20 సెకెన్లలో వెతికి పెట్టండి..
Viral Video: వామ్మో.. ప్రమాదం కూడా ఇతడిని చూస్తే భయపడుతుందేమో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చూడండి..
Viral Video: కోట్లు విలువ చేసే కారు.. ఎడ్లబండి సహాయం లేకపోతే బయటకు రాలేకపోయింది.. వీడియో వైరల్..
Viral Video: కళ్లెదురుగానే మోసం.. యాపిల్స్ అమ్ముకునే వ్యక్తి ఎలా ఛీటింగ్ చేస్తున్నాడో చూస్తే..
IQ Test: ఈ ఆది మానవుల మధ్య ఒక ఆధునికుడు ఉన్నారు.. అది ఎవరో కనిపెడితే మీ బ్రెయిన్ సూపర్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..