Share News

David Warner Slams Air India: పైలట్లు లేని విమానంలో మమల్ని కూర్చోబెడతారా.. ఎయిర్ ఇండియాపై డేవిడ్ వార్నర్ ఆగ్రహం

ABN , Publish Date - Mar 23 , 2025 | 07:35 AM

పైలట్లు లేని విమానంలో తమను కూర్చోబెట్టి గంటల తరబడి వేచి చూసేలా చేశారంటూ ఎయిర్‌ఇండియాపై ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మండిపడ్డాడు. అతడి పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

David Warner Slams Air India: పైలట్లు లేని విమానంలో మమల్ని కూర్చోబెడతారా.. ఎయిర్ ఇండియాపై డేవిడ్ వార్నర్ ఆగ్రహం
David Warner Slams Air India

ఇంటర్నెట్ డెస్క్: విమానయాన సంస్థల సేవాలోపాలపై ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఎయిర్ ఇండియాపై ఫైరపోయారు. మీ పద్ధతి సరికాదంటూ నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

పైలట్లు లేని విమానంలో తమను కూర్చబెట్టారంటూ ఎయిర్ ఇండియాపై డేవిడ్ వార్నర్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ‘‘పైలట్లు లేని విమానంలో మమ్మల్ని కూర్చోబెట్టారు. దీంతో, గంటల పాటు విమానంలోనే మేము వేచి చూడాల్సి వచ్చింది. పైలట్లు లేరని తెలిసీ మమల్ని విమానంలోకి ఎందుకు పంపించారు?’’ అని మండిపడ్డాడు.


Also Read: భారత సంతతి టెకీ చెప్పిన ఇంటర్వ్యూ టిప్.. లైక్ కొట్టిన గూగుల్!

ఇదిలా ఉంటే.. బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షేర్‌గిల్‌ కూడా ఎయిర్ ఇండియాపై మండిపడ్డారు. చెత్త ఎయిర్‌లైన్స్ అవార్డులు గనక ఇస్తే ఎయిర్ ఇండియాకు అవార్డుల పంట పండుతుందని సెటైర్ పేల్చారు. పాడైన సీట్లు, కస్టమర్లతో సరిగా వ్యవహరించని సిబ్బంది ఉన్నారంటూ ఎయిర్‌లైన్స్‌పై విమర్శలు గుప్పించారు.

ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో డేవిడ్ వార్నర్‌ ఆడట్లేదు. ఇటీవల జరిగిన వేలంలో అతడిపై బిడ్స్ ఏవీ దాఖలు కాకపోవడంతో అతడు ఐపీఎల్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. గతంలో అతడు దాదాపు ఎనిమిదేళ్ల పాటు హైదరాబాద్ సన్‌రైజర్స్ తరపున ఆడిన విషయం తెలిసిందే.


Also Read: కొత్తగా ఏదైనా చేద్దామనుకుని దెబ్బైపోయిన మహిళ.. ఇంటిపై నుంచి దూకితే..

ప్రస్తుతం అతడు లండన్ స్పిరిట్ తరపున ది హండ్రడ్ టోర్నీలో పాలుపంచుకోనున్నాడు. ఇక పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌లో కూడా పాల్గొననున్న డేవిడ్ వార్నర్‌ను కరాచీ కింగ్స్ తన టీంలో ప్లాటినం కేటగిరీ ఆటగాడిగా ఎంపిక చేసింది.

టెస్టుల నుంచి గతేడాది జనవరిలోనే రిటైర్ అయ్యాడు. ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్‌ గెలుపు తరువాత వన్డే మ్యాచ్‌లకూ గుడ్‌బై చెప్పేశాడు. అయితే, అంతర్జాతీయ మ్యాచుల నుంచి వైదొలగినా ఫ్రాంచైజ్ టోర్నీల్లో మాత్రం తన ప్రతిభతో జనాలను ఆకట్టుకుంటున్నారు.

Read Latest and Viral News

Updated Date - Mar 23 , 2025 | 07:44 AM