Share News

Brain Teaser Test: మీరు బాగా అనలైజ్ చేస్తారా? అయితే ఈ ముగ్గురిలో దొంగ ఎవరో 7 సెకెన్లలో గుర్తించండి..

ABN , Publish Date - Jan 05 , 2025 | 02:49 PM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.

Brain Teaser Test: మీరు బాగా అనలైజ్ చేస్తారా? అయితే ఈ ముగ్గురిలో దొంగ ఎవరో 7 సెకెన్లలో గుర్తించండి..
IQ Test

ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


వైరల్ అవుతున్న పై ఫొటో మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని టెస్ట్‌ చేసే బ్రెయిన్ టీజర్ పజిల్. ఆ ఫొటోలో ముగ్గురు వ్యక్తులు షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేస్తున్నారు. అయితే ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి దొంగ. ఆ ముగ్గురిలో దొంగ ఎవరో గుర్తించడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 7 సెకెన్ల వ్యవధిలో ఆ వ్యక్తిని కనిపెడితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 7 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ``బి`` అనే వ్యక్తి చేతికి కట్టుకున్నాడు. అయితే అదే చేత్తో సామాన్లు మోస్తున్నాడు. కాబట్టి అతడికి నిజంగా గాయాలు కాలేదు. కాబట్టి అతడు ఫేక్. అతడే దొంగ.

puzzle.jpg

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 05 , 2025 | 02:49 PM