Highest Paying Jobs In India: ఏఐ జమానాలో అత్యధిక జీతాలు ఉన్న ఉద్యోగాలు ఇవే
ABN , Publish Date - Mar 31 , 2025 | 08:16 AM
ఏఐ రాకతో జాబ్ మార్కెట్ సమూలంగా మారిపోతున్న నేటి జమానాలో అత్యధిక శాలరీలు ఇస్తున్న జాబ్స్ ఏవో ఈ కథనంలో చూద్దాం.

ఇంటర్నెట్ డెస్క్: ఏఐ రాకతో ప్రపంచంలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాబ్ మార్కె్ట్ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ఒకప్పటి సంప్రదాయిక ఉద్యోగాలు కనుమరుగవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి స్థానంలో కొత్త అవకాశాలు వస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్‌లో అత్యధిక శాలరీ ఇచ్చే జాబ్ ఏదో ఈ కథనంలో తెలుసుకుందాం.
టాప్ శాలరీలు ఉన్న ఉద్యోగాల్లో ప్రాజెక్టు మేనేజర్ పోస్టు తొలి స్థానంలో ఉంది. ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచి వాస్తవ రూపం ఇచ్చే వరకూ అన్ని దశల్లోనూ ప్రాజెక్టు మేనేజర్లు కీలకం. రిస్క్ మేనేజ్‌మెంట్, పెట్టుబడిదారులతో అనుసంధానం వంటి కీలక బాధ్యతలన్నీ ప్రాజెక్టు మేనేజర్లవే. ఢిల్లీ, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో ప్రాజెక్టు మేనేజర్ల వార్షిక వేతం రూ.15 లక్షల నుంచి మొదలు.
Also Read: విదేశాల్లో ఉండగా పాస్‌పోర్టు పోగొట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే..
కృత్రిమ మేధ జమానాలో ఈ రంగంపై పట్టు ఉన్న ఏఐ ఇంజినీర్లకు డిమాండ్ ఎక్కువే. ఇంటెలిజెంట్ సిస్టమ్స్ రూపకల్పన, కాలానుగూణంగా వీటిల్లో మార్పులు చేయడం, బినినెస్ అవసరాలను బట్టి కొత్త ఫీచర్లు జోడించడం వీరి విధి. ముందస్తు అంచనాలు వేయగలిగే ఆల్గోరిథమ్స్, మోడల్స్‌ను ఏఐ ఇంజినీర్లు డిజైన్ చేస్తారు. ఒరాకిల్, అమెజాన్, గూగుల్ లాంటి సంస్థలు ఏఐ ఇంజినీర్లకు రూ.11 లక్షల సగటు వార్షిక శాలరీ ఆఫర్ చేస్తున్నాయి.
సామాజిక మాధ్యమాలు వచ్చాక డాటా ప్రాముఖ్యత పెరిగిపోయింది. వినియోగదారుల అభిరుచికి సంబంధించి వివిధ సోషల్ మీడియా సైట్లల్లో రోజూ భారీగా సమాచారం పోగవుతోంది. దీన్ని విశ్లేషించి సంస్థలకు అవసరమైన సమాచారాన్ని వెలికితీసే డాటా సైంటిస్టులకు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉంది. డాటా సైంటిస్టుల సగటు వార్షిక శాలరీ రూ.14 లక్షలుగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: తక్కువ పెట్టుబడితో భారీ లాభాలిచ్చే బిజినెస్.. ఒక్కసారి ట్రై చేసి చూడండి..
ఏఐ వ్యవస్థలకు కావాల్సిన గణాంకశాస్త్ర విశ్లేషణ, ఆల్గోరిథమ్స్ అభివృద్ధి బాధ్యతలు మెషీన్ లర్నింగ్ ఇంజినీర్లవే. వీరి సగటు వార్షిక శాలరీ రూ.11 లక్షలుగా ఉంది.
ఇక డాటా సెక్యూరిటీకి సంబంధించి బ్లాక్ చెయిన్ డెవలపర్లు సగటున 8 లక్షలు ఆర్జిస్తున్నారు. వివిధ అప్లికేషన్ల ఫ్రంట్ అండ్ బ్యాండ్ ఎండ్ విషయాలపై పట్టు ఉన్న ఫుల్ స్టాక్ డెవలపర్లు కూడా ఏటా రూ.9 లక్షల వరకూ ఆర్జిస్తున్నారు. మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల వార్షిక వేతనం రూ.6 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.26 లక్షల వరకూ ఉంటోంది. కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు పెంచి లాభాల బాట పట్టించే మార్కెటింగ్ మేనేజర్లు, బిజినెస్ అనలిస్టులు కూడా సగటున రూ.9 లక్షలు ఆర్జిస్తున్నారు.