Man Tricked to Marry Bride's Mother: వరుడికి షాకిచ్చిన అన్నా వదినా.. యువతిని ఆశపెట్టి ఆమె తల్లితో పెళ్లికి ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 19 , 2025 | 08:54 PM
యువతితో పెళ్లని ఆశపెట్టి చివరకు ఆమె తల్లిని ఇచ్చి పెళ్లి చేసేందుకు అన్నా వదినా ప్లాన్ చేయడంతో ఓ యువకుడు భారీ షాక్ తిన్నాడు. పెళ్లిలో వధువు స్థానంలో ఆమె తల్లిని చూసి షాకైపోయాడు. యూపీలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య వివాహాల్లో నానా రకాల మోసాలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లంటేనే యువతీ యువకులు భయపడే స్థితికి చేరుస్తున్నాయి. యూపీలోని మీరట్‌లో తాజాగా ఇలాంటి ఘటన వెలుగులోకొచ్చింది. యువతితో పెళ్లికి సిద్ధమైన వరుడికి ఎదురుగా వధువుకు బదులుగా ఆమె తల్లి కూర్చోవడంతో అతడి ఊహించని షాక్ తగిలింది. మీరట్‌లో గతవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే, బ్రహ్మపురి ప్రాంతానికి చెందిన మొహమ్మద్ అజీమ్‌కు ఈ ఊహించని పరిస్థితి ఎదురైంది. 21 ఏళ్ల యువతి స్థానంలో ఆమె తల్లి వధువుగా ఎంట్రీ ఇవ్వడంతో అతడు భారీ షాక్ తిన్నాడు. ఎదురుగా తలవంచుకుని కూర్చొన్న వధువు కొంగు ఎత్తి చూడగా యువతి స్థానంలో ఆమె తల్లి కనిపించడంతో అతడికి నోటమాట రాలేదు. జరిగిన మోసం తెలిసి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన అన్న నదీమ్, వదిన షాయెదా ఈ సంబంధం తీసుకొచ్చారని అజీమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. షాయెదా బంధువైన 21 ఏళ్ల మంతాషాను ఇచ్చి పెళ్లి చేస్తామని వారు మాటిచ్చారని తెలిపాడు. అయితే, పెళ్లి తంతు జరుగుతుండగా తనకు డౌట్ మొదలైందని అన్నాడు. పెళ్లి జరిపిస్తున్న మౌల్వీ.. మంతాషా పేరుకు బదులు ఆమె తల్లి తహీరా (42) పేరు చదవడంతో తాను షాకయ్యానని చెప్పాడు. ఎదురుగా కూర్చొన్న మహిళ ముఖంపై నుంచి చెంగు తొలగించి చూస్తే 42 ఏళ్ల తహీరా కనిపించిందని, దీంతో భారీ షాక్ తగిలిందని అన్నాడు.
దీంతో తాను పెళ్లికి నిరాకరిస్తే అన్నా వదినా బెదిరింపులకు దిగారని బాధితుడు ఆరోపించాడు. పెళ్లికి ఒప్పుకోక పోతే ఫేక్ రేప్ కేసు పెట్టి వేధింస్తామంటూ భయపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. దీంతో, తాను వెంటనే అక్కడి నుంచి బయటకొచ్చి నేరుగా మీరట్‌లోని ఎస్ఎస్‌పీ ఆఫీసులో ఫిర్యాదు చేశానని తెలిపారు.
ఈ ఘటనపై మీరట్ ఎస్ఎస్‌పీ స్పందించారు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందినట్టు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, ఈ ఉదంతం స్థానికంగా పెను కలకలానికి దారి తీసింది. తోడబుట్టిన అన్నే ఇంత మోసం చేశాడంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
కాబోయే భర్తపై ప్రియుడితో దాడి చేయించిన యువతి.. కోమాలో బాధితుడు
అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు
వచ్చే నెలలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను భారతీయ గగనయాత్రికుడు శుభాంశూ శుక్లా..