Stress Free Life: జీవితంలో ఒత్తిడిని జయించాలనుకుంటే ఈ టిప్స్ పాటించండి
ABN , Publish Date - Mar 19 , 2025 | 04:18 PM
జీవితంలో ఒత్తిడి ఎక్కువైతే మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా పాడవుతుంది. కాబట్టి, ఎల్లప్పుడు ఉండే ఒత్తిడిని ఎదుర్కొనేందుకు కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: నేటి ఉరుకులపరుగుల జీవితంలో ఒత్తిడి ఎదుర్కోని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ నిత్యం ఒత్తిడి బారిన పడితే మాత్రం అనారోగ్యం బారిన పడాలి. ఒత్తిడిని అదుపులో పెట్టుకోలేని వారు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని వైద్యులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. మరి ఈ స్ట్రెస్‌ను అదుపులో పెట్టుకునేందుకు పాటించాల్సిన ట్రిక్స్ ఏంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం (stress-free life tips).
ఒత్తిడిని జయించేందుకు మనకున్న అత్యంత సులభమైన మార్గాల్లో మైండ్‌ఫుల్‌నెస్ ప్రధానమైదని. అంటే.. అనవసర ఆలోచనలు మారి వాస్తవంలో జీవించడం. మనసులో తలెత్తే ఆలోచనలను గమనిస్తూనే వాటిపై అదుపు సాధించే ప్రయత్నం చేయడం. ధ్యానం, ఆలోచనలు, మాటలు, చేసే చర్యలపై అదుపు కోసం ప్రయత్నిస్తే ఒత్తిడి దానంతట అదే అగ్గిపోతుంది.
Also Read: సునీత విలియమ్స్ శాలరీ.. అంతరిక్షంలో ఓవర్ టైం.. పరిహారం ఎంతంటే..
మన చుట్టూ పరిసరాలు కూడా మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇల్లంతా చిందరవందరగా ఉంటే మనసు కూడా ఇలాగే గజిబిజిగా మారుతుంది. కాబట్టి, ఇంట్లో అయినా ఆఫీసులో ఉన్నా మీరు కూర్చొనే చోట వస్తువులన్నీ ఓ క్రమపద్ధతిలో అమర్చుకుంటే లైఫ్ సులువుగా ఉంటుంది. ఒత్తిడి దరిచేరదు
మనసుకు స్థిరత్వం తీసుకురావడంలో క్రమశిక్షణది అత్యంత ప్రముఖమైన పాత్ర. రోజూ టైం ప్రకారం నిద్రలేవడం, పడుకోవడం, మంచి ఆహారం తినడం, మంచి వారితో స్నేహం చేయడం వంటివన్నీ మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. రోజూ పనులకు ఓ క్రమపద్ధతిలో చేస్తే మనసుపై ఒత్తిడి ఆటోమేటిక్‌గా తగ్గుతుంది.
Also Read: హాలీవుడ్ స్టార్ ఇంట్లో డిన్నర్ పార్టీ.. ఏ భారతీయ వంటకాలు సిద్ధం చేశారో చూస్తే.
స్మార్ట్ ఫోన్, కంప్యూటర్‌ల వినియోగానికి వీలైనంత తక్కువ సమయం కేటాయించడం కూడా మనసుకు ప్రశాంతత నిస్తుంది. నిత్యం స్మార్ట్ ఫోన్లతో గడిపే వారిలో ఒత్తిడి లెవెల్స్ అధికంగా ఉన్నట్టు శాస్త్రజ్ఞులు ఎప్పుడో గుర్తించారు.
ఎంత బిజీగా ఉన్నా కూడా మీకోసమంటూ కొంత సమయం కేటాయించుకోవడం కూడా మానసిక ఆరోగ్యానికి అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు. రుచికరమైన టీ లేదా కాఫీ తాగడం, ఇష్టమై మ్యూజిక్ వినడం, పచ్చదనాన్ని చూస్తూ సేదతీరడం వంటివి చేస్తే ఎండార్ఫిన్లు విడుదలైన మానసిక సంతృప్తి, ఆనందం పెరుగుతాయి. ఒత్తిడి తాలూకు ప్రభావం తగ్గుతుంది.