Share News

అర్జున్‌ పాయింట్‌ పంచుకున్నాడు!

ABN , Publish Date - Jan 30 , 2025 | 02:35 AM

టాటా స్టీల్‌ చెస్‌ టోర్నీలో గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి మరో గేమునూ డ్రా చేసు కున్నాడు. విన్సెంట్‌ కీమర్‌ (జర్మనీ)తో బుధవారం జరిగిన పదోరౌండ్‌ గేమ్‌...

అర్జున్‌ పాయింట్‌ పంచుకున్నాడు!

వికాన్‌ జీ (నెదర్లాండ్స్‌): టాటా స్టీల్‌ చెస్‌ టోర్నీలో గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి మరో గేమునూ డ్రా చేసు కున్నాడు. విన్సెంట్‌ కీమర్‌ (జర్మనీ)తో బుధవారం జరిగిన పదోరౌండ్‌ గేమ్‌లో 38 ఎత్తుల అనంతరం పాయింట్‌ పంచుకున్నాడు. అర్జున్‌కిది వరుసగా మూడో డ్రా. ఇక వార్మెర్డామ్‌పై గెలుపొందిన గుకేష్‌ 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఫెడొసీవ్‌పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. అనీష్‌ గిరి (నెదర్లాండ్స్‌)తో భారత ఆటగాడు మెండోకా గేమ్‌ కూడా ఫలితం లేకుండా ముగిసింది.


ఇవీ చదవండి:

ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో తిలక్.. ఆజామూ నీకు మూడింది

పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

సంజూ కెరీర్ ఫినిష్.. ఒక్క షాట్ ఎంత పని చేసింది

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 30 , 2025 | 02:35 AM