Share News

అశ్విన్‌ స్వార్థపరుడు

ABN , Publish Date - Jan 03 , 2025 | 05:57 AM

ఆస్ట్రేలియాతో సిరీస్‌ మధ్యలో ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడాన్ని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డారెల్‌ కలినాన్‌ తీవ్రంగా తప్పుబట్టాడు....

అశ్విన్‌ స్వార్థపరుడు

రిటైర్మెంట్‌పై కలినాన్‌ ఫైర్‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో సిరీస్‌ మధ్యలో ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడాన్ని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డారెల్‌ కలినాన్‌ తీవ్రంగా తప్పుబట్టాడు. అతడిది స్వార్థ, విద్వేషపూరిత నిర్ణయమని మండిపడ్డాడు. ‘సిరీస్‌ మధ్యలో అశ్విన్‌ వీడ్కోలు ప్రకటించాల్సింది కాదు. అతడిది స్వార్థపూరిత నిర్ణయంగా అనిపిస్తోంది. చోటు దక్కకపోతే జట్టునే ఇబ్బందిపెట్టేలా విద్వేషపూరితంగా వ్యవహరిస్తాడా? ఒక్క వారం ఆగి.. సిడ్నీ టెస్ట్‌ తర్వాత గుడ్‌బై పలకాల్సింద’ని కలినాన్‌ అన్నాడు. ఆఖరి టెస్ట్‌లో టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు.

Updated Date - Jan 03 , 2025 | 05:57 AM