BCCI : రోహిత్‌కు ముందే చెప్పేశారా?
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:57 AM
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఆఖరి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ ‘విశ్రాంతి’ పేరుతో దూరంగా ఉండడం వెనుక పెద్ద కథే నడిచినట్టు సమాచారం. టెస్టులకు సంబంధించి భారత
అందుకే ‘విశ్రాంతి’ పేరిట దూరం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ఆఖరి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ ‘విశ్రాంతి’ పేరుతో దూరంగా ఉండడం వెనుక పెద్ద కథే నడిచినట్టు సమాచారం. టెస్టులకు సంబంధించి భారత జట్టు ప్రణాళికల్లో 37 ఏళ్ల రోహిత్ లేడని బీసీసీఐ ఇటీవల అతడికి స్పష్టంజేసినట్టు తెలిసింది. భారత జట్టు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా ఉన్నాయి. పరిస్థితులు అనుకూలించి ఒకవేళ టీమిండియా తుది పోరుకు చేరినా..
బుమ్రానే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బోర్డు పెద్దలు రోహిత్‌కు చెప్పినట్టు సమాచారం. మొత్తంగా పరిస్థితులు అనుకూలంగా లేవని గ్రహించిన హిట్‌మ్యాన్ సిడ్నీ టెస్ట్‌కు ‘విశ్రాంతి’ పేరిట దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈనేపథ్యంలో బాక్సింగ్ డే టెస్టుతోనే రోహిత్ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆఖరి మ్యాచ్ ఆడేశాడన్నమాట!
రోడ్ మ్యాప్ ఇదే!
చివరి టెస్టు ఆడేసిన రోహిత్‌కు..అంతర్జాతీయంగా మిగిలింది వన్డేలే. వాస్తవంగా దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చే 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడాలనేది రోహిత్ అభిలాష. కానీ ఇప్పుడు అది నెరవేరేలా కనిపించడంలేదు. భారత జట్టు వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు ఆడనుంది. ఆపై చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననుంది. అంటే..ఇంగ్లండ్‌తో సిరీ్‌సతోపాటు చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్‌గా ఆడించడం ద్వారా 50 ఓవర్ల ఫార్మాట్‌కూ రోహిత్ వీడ్కోలు పలికేలా బీసీసీఐ ప్రణాళిక తయారు చేయనున్నట్టు సమాచారం. ఒకవేళ చాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలిస్తే రోహిత్ అంతర్జాతీయ కెరీర్‌కు ఘనమైన ముగింపు లభించినట్టే. అలాగే ధోనీ (2007 టీ20, 2011 వన్డే వరల్డ్ కప్‌లు) తర్వాత సారథిగా రెండు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఘనత రోహిత్‌కు దక్కుతుంది.