Share News

SRH Captain Shocking Comments: భయమేస్తోంది.. జీవితంలో ఆ పని చేయబోనంటున్న కమిన్స్

ABN , Publish Date - Mar 24 , 2025 | 02:22 PM

రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు మొదటి ఓవర్ నుంచి దూకుడుగా ఆడారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, క్లాసెన్, ఇషాన్ కిషన్, నితిష్ రెడ్డి రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇషాన్ కిషన్ సెచరీతో చెలరేగిపోగా, హెడ్ 216.13 స్ట్రైక్ రేటుతో 31 బంతుల్లో 67 పరుగులు చేశారు.

SRH Captain Shocking Comments: భయమేస్తోంది.. జీవితంలో ఆ పని చేయబోనంటున్న కమిన్స్
Cummins

ఐపీఎల్ 18వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. రాజస్తాన్ రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో గెలుపొందింది. సన్‌రైజర్స్ బ్యాటింగ్‌‌పై ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేయాలని అనుకోనంటూ ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.


గత సీజన్‌లోనూ కమిన్స్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సన్‌రైజర్స్ బ్యాటర్లు ఎలాంటి బాల్ వేసినా ఆదివారం నాటి మ్యాచ్‌లో బౌండరీ పంపించారు. దీంతో కమిన్స్ తన టీమ్‌ను ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేశారు. సన్‌రైజర్స్‌కు బౌలింగ్ వేయాలంటే భయమేస్తుందనే అర్థం వచ్చేలా కమిన్స్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ ఒకరు. ఆస్ట్రేలియాకు చెందిన కమిన్స్‌కు ఐపీఎల్‌లోనూ బెస్ట్ ట్రాక్ రికార్డు ఉంది. మొత్తానికి తన సొంత టీమ్‌పై ప్రశంసలు కురిపించేందుకు కమిన్స్ ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు.


కమిన్స్ వ్యాఖ్యల వెనుక

రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు మొదటి ఓవర్ నుంచి దూకుడుగా ఆడారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, క్లాసెన్, ఇషాన్ కిషన్, నితిష్ రెడ్డి రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇషాన్ కిషన్ సెచరీతో చెలరేగిపోగా, హెడ్ 216.13 స్ట్రైక్ రేటుతో 31 బంతుల్లో 67 పరుగులు చేశారు. నితీష్ రెడ్డి 15 బంతుల్లో 30 పరుగులు చేశాడు. క్లాసెన్ 14 బంతుల్లో 34 పరుగులు చేసి రాజస్తాన్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. మరో వరల్డ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను సన్‌రైజర్స్ బ్యాటర్లు చితక్కొట్టారు. 4 ఓవర్లు వేసిన ఆర్చర్ 76 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రస్తుత ఉత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా ఉన్న ఆర్చర్‌ను ఆటాడుకోవడంతో కమిన్స్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోది.


గత సీజన్‌లో

గత సీజన్‌లో కూడా కమిన్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. 2024లో ఎస్‌ఆర్‌హెచ్ అత్యధిక స్కోర్లు నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌పై మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగాఆ సీజన్‌లో ట్రావిస్ హెడ్ 567 పరుగులు, అభిషేక్ శర్మ 484 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్ 463 పరుగులతో అద్భుతంగా ఆడారు. మా బ్యాటర్లు ఇలా ఆడితే ఎవరైనా భయపడతారని ని కమిన్స్ గతంలో కామెంట్స్ చేశారు. SRH ఆ సీజన్‌లో ఫైనల్‌కు చేరినా కేకేఆర్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

టెక్‌ వ్యూ : కన్సాలిడేషన్‌కు ఆస్కారం

ఫార్మా కింగ్‌ దివీస్‌ మురళి

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 24 , 2025 | 02:22 PM