Share News

శ్రీలంకకు ఓదార్పు విజయం

ABN , Publish Date - Jan 12 , 2025 | 01:44 AM

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 140 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన కివీస్‌ 2-1తో సిరీస్‌ దక్కించుకుంది. శనివారం జరిగిన...

శ్రీలంకకు ఓదార్పు విజయం

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 140 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఇప్పటికే రెండు వన్డేలు గెలిచిన కివీస్‌ 2-1తో సిరీస్‌ దక్కించుకుంది. శనివారం జరిగిన ఈ చివరి మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 290 పరుగులు చేసింది. ఓపెనర్‌ నిస్సాంక (66), కుశాల్‌ మెండిస్‌ (54), లియనగె (53), కమిందు మెండిస్‌ (46) రాణించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ మ్యాట్‌ హెన్రీ 4, శాంట్నర్‌ 2 వికెట్లు తీశారు. ఛేదనలో కివీస్‌ 29.4 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. చాప్‌మన్‌ (81) మాత్రమే పోరాడగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అసిత ఫెర్నాండో, తీక్షణ, ఎషాన్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి.

Updated Date - Jan 12 , 2025 | 01:44 AM