Share News

David Warner: ఐపీఎల్ పొమ్మంది.. పాకిస్తాన్ లీగ్ ఆహ్వానించింది.. కట్ చేస్తే

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:45 PM

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడేటపుడు తెలుగు సినిమా పాటలకు, డైలాగ్‌లకు వార్నర్ అభినయం ఎంతో మందిని ఆకట్టుకుంది. కాగా, గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో వార్నర్‌ను దక్కించుకునే ఐపీఎల్ టీమ్‌లేవీ ఆసక్తి చూపించలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.

David Warner: ఐపీఎల్ పొమ్మంది.. పాకిస్తాన్ లీగ్ ఆహ్వానించింది.. కట్ చేస్తే
David Warner

డేవిడ్ వార్నర్ (David Warner).. పేరుకు ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ భారతీయులకు ఎంతో సుపరిచితుడు. తన ఆటతోనే కాకుండా సోషల్ మీడియాలో సందడితో కూడా వార్తల్లో ఉంటుంటాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడేటపుడు తెలుగు సినిమా పాటలకు, డైలాగ్‌లకు వార్నర్ అభినయం ఎంతో మందిని ఆకట్టుకుంది. కాగా, గతేడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో (IPL Auction) వార్నర్‌ను దక్కించుకునే ఐపీఎల్ టీమ్‌లేవీ ఆసక్తి చూపించలేదు. దీంతో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు (IPL 2025).


ఐపీఎల్‌లో ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) వైపు దృష్టి సారించాడు. అతడిని కరాచీ కింగ్స్ ఫ్రాంఛైజీ అతడిని 2.75 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో భాగంగా పెషావర్ జల్మీతో కరాచీ కింగ్స్ తరపున ఆడుతూ వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. 47 బంతుల్లో 60 పరుగులు చేసి ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 13 వేల పరుగుల మైలు రాయిని దాటిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ 403 ఇన్నింగ్స్‌లలో 13, 009 పరుగులు చేశాడు.


ప్రపంచంలో కేవలం ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఇప్పటివరకు ఈ ఘనత సాధించారు. వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. గేల్ 455 ఇన్నింగ్స్‌లలో 14, 562 పరుగులు చేశాడు. ఆ తర్వాత రెండో స్థానంలో ఇంగ్లండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ (13, 610 పరుగులు), మూడో స్థానంలో పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ (13, 571 పరుగులు), నాలుగో స్థానంలో వెస్టిండీస్‌ ఆటగాడు కీరన్ పొలార్డ్ (13, 537 పరుగులు), ఐదో స్థానంలో విరాట్ కోహ్లీ (13, 208) ఉన్నారు. తాజాగా వార్నర్ కూడా 13 వేల పరుగుల మైలు రాయిని దాటి ఆ ఘనత సాధించిన ఆరో క్రికెటర్‌గా నిలిచాడు. అలాగే టీ20 క్రికెట్‌లో 13 వేల పరుగులు చేసిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా కూడా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 22 , 2025 | 04:45 PM