Share News

Rohit Sharma ; ‘మెల్‌బోర్న్‌’తోనే గుడ్‌ బై చెబుదామనుకున్నాడా!

ABN , Publish Date - Jan 12 , 2025 | 05:37 AM

ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆడే విషయంలో పెద్ద చర్చ జరిగింది. మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగోది, బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ఓపెనర్‌గా పునరాగమనం చేసినా రోహిత్‌ ఆట గాడిలో పడలేదు. ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్ట్‌ తుది

 Rohit Sharma ; ‘మెల్‌బోర్న్‌’తోనే గుడ్‌ బై చెబుదామనుకున్నాడా!

ముంబై: ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆడే విషయంలో పెద్ద చర్చ జరిగింది. మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగోది, బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ఓపెనర్‌గా పునరాగమనం చేసినా రోహిత్‌ ఆట గాడిలో పడలేదు. ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్ట్‌ తుది జట్టు నుంచి అతడిని తప్పిస్తారని, దాంతో టెస్ట్‌లకు భారత కెప్టెన్‌ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే ఊహాగానాలు వినిపించాయి. మొత్తంగా.. ఫామ్‌లో లేని కారణంగా తానే ఆఖరి టెస్ట్‌కు దూరంగా ఉన్నానని రోహిత్‌ ప్రకటించి చర్చోపచర్చలకు తెరదించాడు. అయితే బాక్సింగ్‌ డే టెస్ట్‌లోనూ రాణించకపోవడంతో సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయానికి హిట్‌మ్యాన్‌వచ్చేశాడట. ‘మెల్‌బోర్న్‌లోనూ విఫలమవడంతో వీడ్కోలు పలకాలని రోహిత్‌ నిర్ణయించుకున్నాడు. కానీ శ్రేయోభిలాషులు నచ్చజెప్పడంతో మనసు మార్చుకున్నాడు’ అని రోహిత్‌ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Jan 12 , 2025 | 05:37 AM