Share News

Ind Vs Eng T20: ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టీ20.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు

ABN , Publish Date - Feb 02 , 2025 | 08:19 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓపెనర్ చెలరేగిపోయాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేసి ఈ ఫార్మాట్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన రెండో భారతీయ ఆటగాడిగా నిలిచాడు.

Ind Vs Eng T20: ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టీ20.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ అదరగొడుతోంది. 3-1తో ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న భారత్ రెట్టించిన ఉత్సాహంతో బ్యాటింగ్‌కు దిగింది. ఇక భారత ఓపెనర్ అభిషేక్ తొలి నుంచీ ఇంగ్లండ్‌ బౌలర్లపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు. సిక్సులతో చెలరేగిన అతడు కేవలం 37 బంతుల్లోనే సెంచరీ బాదాడు. పవర్ ప్లే ఓవర్స్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుని టీ20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన రెండో భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుమునుపు, 17 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసి.. వేగవంతమైన ఫిఫ్టీలు చేసిన ఆగటాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 2017లో శ్రీలంకపై మ్యాచ్‌ సందర్భంగా 35 బంతుల్లో టీ20 సెంచరీతో అత్యంత వేగవంతమైన శతకం బాదిన ఆటగాడిగా రోహిత్ నిలిచిన విషయం తెలిసిందే.

ఇక తొలి ఓవర్లో బ్యాట్ ఝళిపించిన శాంసన్ రెండో ఓవర్‌లో వికెట్ చేజార్చుకున్నాడు. వుడ్ బౌలింగ్‌లో ఆర్చర్‌కు క్యాచ్ ఇచ్చి 16 పరుగులకే వెనుదిగిరాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

Read Latest and Sports News

Updated Date - Feb 02 , 2025 | 08:39 PM