Riyan Parag: ఆ కుర్రాడికి రూ.10 వేలు ఇచ్చాడా.. రియాన్ పరాగ్ కాళ్లు మొక్కడంపై నెటిజన్లు కామెంట్లు ఏంటంటే
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:36 PM
మన దేశంలో క్రికెటర్లు విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉంటారు. అభిమాన క్రికెటర్లను కలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కొందరు సాహసవంతులు స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో భద్రతా వలయాన్ని ఛేదించుకుని మైదానంలోకి వెళ్లిపోతారు.

మన దేశంలో క్రికెటర్లను (Cricketers) దేవుళ్లతో సమానంగా కొలుస్తారు. ఏ దేశంలోనూ లేనంతగా మన దేశంలో క్రికెటర్లు విపరీతమైన ఫాలోయింగ్ కలిగి ఉంటారు. అభిమాన క్రికెటర్లను కలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కొందరు సాహసవంతులు స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో భద్రతా వలయాన్ని ఛేదించుకుని మైదానంలోకి వెళ్లిపోతారు. తమ అభిమాన క్రికెటర్లను పట్టుకుని సంతోషపడిపోతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి (Pitch Invader).
ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ క్రికెటర్లను కలుసుకునేందుకు చాలా మంది స్టేడియంలో సాహసాలు చేస్తుంటారు. అయితే తాజాగా గౌహతీలో జరిగిన ఐపీఎల్ (IPL 2025) మ్యాచ్ సందర్భంగా ఓ కుర్రాడు మైదానంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి రాజస్తాన్ ఆటగాడు రియాన్ పరాగ్ (Riyan Parag) కాళ్లు మొక్కాడు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది వచ్చి, ఆ కుర్రాడిని బయటికి తీసుకెళ్లారు. అయితే ఇది స్క్రిప్టెడ్ అయి ఉండొచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే రియాన్ పరాగ్ జాతీయ జట్టుకు కనీసం 10 మ్యాచ్‌లు కూడా ఆడలేదు. ఐపీఎల్‌లో కూడా చెప్పుకోదగిన స్థాయిలో రాణించింది లేదు.
అలాంటి రియాన్ పరాగ్ కాళ్లపై ఓ అభిమాని (Riyan Parga Fan) పడడాన్ని చాలా మంది నమ్మలేకపోతున్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలోకి వచ్చి కాళ్లు మొక్కడం కోసం ఆ కుర్రాడికి రియాన్ పరాగ్ రూ.10 వేలు ఇచ్చి ఉంటాడని చాలా మంది కామెంట్లు చేశారు. అయితే ఈ ఆరోపణల్లో నిజం ఉండకపోవచ్చు. ఎందుకంటే వెనుకబడిన రాష్ట్రమైన అసోం నుంచి క్రికెటర్‌గా ఎదిగిన యువకుడు రియాన్ పరాగ్. నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ అసోం రాజధాని గౌహతిలో జరిగింది. దీంతో స్వంత రాష్ట్రంలో పరాగ్‌కు ఆ మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..
Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..