గౌతీ ఓటు యశస్వికే!
ABN , Publish Date - Jan 14 , 2025 | 04:59 AM
ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్న రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. అయితే, అతడి తర్వాత జట్టు పగ్గాలను ఎవరికి అప్పగించాలన్నది....
పంత్ కావాలంటున్న అగార్కర్
భవిష్యత్ కెప్టెన్ ఎంపిక వ్యవహారం
న్యూఢిల్లీ: ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్న రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించేందుకు బీసీసీఐ సన్నద్ధమవుతోంది. అయితే, అతడి తర్వాత జట్టు పగ్గాలను ఎవరికి అప్పగించాలన్నది పెద్ద సమస్యగా మారింది. కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేస్తే..అతనికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆస్ట్రేలియా పర్యటనపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రోహిత్ బీసీసీఐకి తేల్చి చెప్పాడని సమాచారం. ఈ నేపథ్యంలో వన్డే ఫార్మాట్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ వరకు హిట్‌మ్యాన్‌నే సారథిగా కొనసాగించే అవకాశాలున్నాయి. కానీ, భవిష్యత్ కెప్టెన్ విషయంలోనే గందరగోళం నెలకొంది. బుమ్రాకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించడానికి బోర్డు సుముఖంగానే ఉందట. కానీ, అతడి ఫిట్‌నె్‌సను దృష్టిలో ఉంచుకొని సమర్థుడైన వైస్ కెప్టెన్ ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో రిషభ్ పంత్‌ను భవిష్యత్ టెస్ట్ కెప్టెన్‌గా అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సూచిస్తుండగా.. కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం యశస్వీ జైస్వాల్‌కు మద్దతు తెలుపుతున్నాడట. దీంతో అగార్కర్, గౌతీ మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు నెలకొన్నాయని సమాచారం.