గాయత్రి జోడీ శుభారంభం
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:19 AM
భారత స్టార్ జంట పుల్లెల గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ మలేసియా ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి మ్యాచ్‌లో...
కౌలాలంపూర్: భారత స్టార్ జంట పుల్లెల గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ మలేసియా ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి మ్యాచ్‌లో ఆరో సీడ్ గాయత్రి/ట్రీసా ద్వయం 21-10, 21-10తో చైనీస్ తైపీ జంట ఓర్నిచ్నా/సుకితను ఓడించి ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఇక, సింగిల్స్‌లో భారత స్టార్ లక్ష్యసేన్ 14-21, 7-21తో చి యు జెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడాడు. కాగా, కెనడా షట్లర్ బ్రయాన్ యాంగ్‌తో తొలిరౌండ్ మ్యాచ్‌లో ప్రణయ్ 21-12, 6-3తో ఆధిక్యంలో ఉన్న దశలో గది పైకప్పు లీకై వర్షపు నీరు కారడంతో మ్యాచ్‌ని నిలిపేశారు. ఆ తర్వాత మ్యాచ్ మొదలైనా పైకప్పు సమస్య మళ్లీ మొదలవడంతో మ్యాచ్‌ను బుధవారం కొనసాగించాలని నిర్ణయించారు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి ప్రణయ్ 21-12, 9-11తో ఉన్నాడు.