Share News

IPL 2025: నువ్వు మారవా..ఐపీఎల్‌ వదిలేసి పల్లీ బఠాణీలు అమ్ముకో, స్టార్ ఆటగాడిపై ట్రోల్స్..

ABN , Publish Date - Mar 25 , 2025 | 09:17 PM

ఒకప్పుడు ప్రపంచ స్థాయి ఆటగాడు. కానీ ఇప్పుడు మాత్రం ఐపీఎల్‌లో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఆయన ఆటతీరు పట్ల అభిమానులు దారుణంగా కామెంట్లు చేస్తూ, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎవరు అతను, ఎంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

IPL 2025: నువ్వు మారవా..ఐపీఎల్‌ వదిలేసి పల్లీ బఠాణీలు అమ్ముకో, స్టార్ ఆటగాడిపై ట్రోల్స్..
Glenn Maxwell Ducks Out

గ్లెన్ మ్యాక్స్‌వెల్(Glenn Maxwell). క్రికెట్ ప్రపంచంలో ఒక అద్భుతమైన ఆటగాడు. టీ20ల్లో అతని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ గత ఏడాది నుంచి మాత్రం ఐపీఎల్‌లో అతని ఆట తీరు దారుణంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా(IPL 2025) పంజాబ్ కింగ్స్ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిషోర్ వేసిన తొలి బంతికి అతను ఎల్బీడబ్ల్యూ అవ్వడంతో అతని ఐపీఎల్ అనుభవంపై చర్చలు వస్తున్నాయి. దీంతో ఆయనపై ట్రోల్స్ మొదలయ్యాయి.


మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ వైఫల్యాల విశ్లేషణ

ఇది కేవలం అతని తాజాగా జరిగిన డక్ ఔట్ కాదు. 2024 ఐపీఎల్ సీజన్‌లో కూడా అతని ఆట అనేకమంది అభిమానులకు నిరాశను కలిగించింది. ప్రపంచ స్థాయి ఆటగాడు అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో ఎందుకిలా ఆడుతున్నాడని చర్చించుకుంటున్నారు.

మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో 135 మ్యాచ్‌లలో 2,771 పరుగులు చేసి, సగటు 24.74, స్ట్రైక్ రేట్ 156.73. 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున అతను 552 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. కానీ ఆ తర్వాత అతని ఆట స్థిరంగా కొనసాగలేకపోయింది. ముఖ్యంగా భారీ షాట్స్ ఆడే విషయంలో విఫలవుతున్నాడు. ఈ క్రమంలో 2024 ఐపీఎల్ సీజన్‌లో అత్యంత దారుణంగా కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు.


ఐపీఎల్లో మ్యాక్స్‌వెల్ చివరి పది మ్యాచ్‌లలో ఆటతీరు

  • 25 మార్చి 2025, GT vs PBKS: 0 (1 బంతి, డక్)

  • 22 మే 2024, RR vs RCB (ఎలిమినేటర్): 0 (1 బంతి, డక్)

  • 18 మే 2024, CSK vs RCB: 16 (5 బంతులు)

  • 12 మే 2024, DC vs RCB: 3 (6 బంతులు)

  • 4 మే 2024, GT vs RCB: 28 (19 బంతులు)

  • 11 ఏప్రిల్ 2024, MI vs RCB: 0 (4 బంతులు, డక్)

  • 6 ఏప్రిల్ 2024, RR vs RCB: 1 (3 బంతులు)

  • 2 ఏప్రిల్ 2024, LSG vs RCB: 0 (2 బంతులు, డక్)

  • 29 మార్చి 2024, KKR vs RCB: 4 (6 బంతులు)

  • 25 మార్చి 2024, PBKS vs RCB: 3 (5 బంతులు)


ఈ పది మ్యాచ్‌లలో, మ్యాక్స్‌వెల్ కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 5.5, స్ట్రైక్ రేట్ 112.24. నాలుగు డక్‌లు, ఒక 20+ స్కోరు మాత్రమే సాధించాడు. అతని బౌలింగ్ (2024లో 6 వికెట్లు) కొంత ఉపయోగపడినా, బ్యాటింగ్‌లో మాత్రం దారుణ వైఫల్యం ఉందని చెప్పవచ్చు.

ప్రపంచ స్ధాయి ఆటగాడు అయినా ఎందుకు విఫలమయ్యాడు

గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రపంచ క్రికెట్‌లో ఒక అద్భుతమైన ఆటగాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో అద్భుతమైన ఆటతీరు, 2021 టీ20 ప్రపంచకప్‌లో అత్యంత కీలకమైన పాత్ర పోషించాడు. అయితే, ఐపీఎల్లో మాత్రం స్థిరంగా రాణించలేకపోతున్నాడు.

అయితే మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌లో నిలకడగా ఆడకపోవడానికి అనేక కారణాలు ఉంటాయని పలువురు అంటున్నారు. ఫ్రాంఛైజీల ఒత్తడి, ఆఫ్ ఫీల్డ్ ప్రభావం, లేదా ఆడలేని షాట్స్ వంటి అనేక విషయాలు అతనిపై ప్రభావం చూపిస్తున్నాయని పలువురు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుత ఆటతీరు పట్ల అభిమానులు మాత్రం అతనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి:

IPL 2025: పంజాబ్ సూపర్ కింగ్స్‌లో పవర్‌ఫుల్ హిట్టర్ల లిస్ట్ చుశారా..

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 25 , 2025 | 10:03 PM