‘చాంపియన్స్ ట్రోఫీ’కి భారీ భద్రత
ABN , Publish Date - Jan 24 , 2025 | 04:44 AM
వచ్చే నెలలో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. 1996 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఇక్కడ జరుగుతున్న...

లాహోర్: వచ్చే నెలలో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. 1996 వన్డే వరల్డ్‌కప్ తర్వాత ఇక్కడ జరుగుతున్న ప్రధాన టోర్నమెంట్ ఇదే కావడం గమనార్హం. అందుకే ఆటగాళ్లు, స్టేడియాల భద్రత కోసం 12,564 మంది సిబ్బందిని మోహరించబోతోంది. ఇందులో లాహోర్‌లో 7618 మంది, రావల్పిండిలో 4535 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తారని పాక్ మీడియా కథనం. అలాగే స్పెషల్ బ్రాంచికి చెందిన 411 మంది అధికారులు పరిస్థితులను సమన్వయం చేసే పనిలో ఉంటారు. అవసరమైతే పాక్ సైన్యం సహాయం కూడా తీసుకుంటారు.