Share News

హైదరాబాద్‌కు నిరాశ

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:51 AM

విజయ్‌ హజారే టోర్నీలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓటమిపాలైంది. తొలుత పంజాబ్‌.. ప్రభ్‌సిమ్రన్‌ (137) సెంచరీకి తోడు అభిషేక్‌ (93) రాణించడంతో

హైదరాబాద్‌కు నిరాశ

అహ్మదాబాద్‌: విజయ్‌ హజారే టోర్నీలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓటమిపాలైంది. తొలుత పంజాబ్‌.. ప్రభ్‌సిమ్రన్‌ (137) సెంచరీకి తోడు అభిషేక్‌ (93) రాణించడంతో 4 వికెట్లకు 426 రన్స్‌ చేసింది. ఛేదనలో అర్ష్‌దీప్‌ (4/50), రఘు(3/68) ధాటికి హైదరాబాద్‌ 47.5 ఓవర్లలో 346 రన్స్‌కు ఆలౌటైంది. నితేశ్‌ రెడ్డి (111) సెంచరీ వృథా అయింది. ఇక గ్రూప్‌-బిలో ఆంధ్ర జట్టు 5 వికెట్లతో మహారాష్ట్ర చేతిలో చిత్తయింది.

Updated Date - Jan 04 , 2025 | 05:51 AM