IPL 2025, CSK vs RR: ట్రెండ్ మార్చిన చెన్నై.. ఆ ఇద్దరినీ జట్టు నుంచి తప్పించారుగా
ABN , Publish Date - Mar 30 , 2025 | 07:36 PM
జట్టులోని ఒకరిద్దరు ఆటగాళ్లు విఫలమైనా వరుసగా అవకాశాలు ఇవ్వడం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎప్పట్నుంచో పాటిస్తున్న సాంప్రదాయం. విఫలమవుతున్న ఆటగాడికైనా కనీసం 10 మ్యాచ్‌ల్లో అవకాశాలు కల్పిస్తారు. అప్పటికీ రాణించకపోతేనే వారిని జట్టు నుంచి తప్పిస్తారు.

ఐపీఎల్ (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రెండ్ మార్చింది. జట్టులోని ఒకరిద్దరు ఆటగాళ్లు విఫలమైనా వరుసగా అవకాశాలు ఇవ్వడం ఆ జట్టు ఎప్పట్నుంచో పాటిస్తున్న సాంప్రదాయం. విఫలమవుతున్న ఆటగాడికైనా కనీసం 10 మ్యాచ్‌ల్లో అవకాశాలు కల్పిస్తారు. అప్పటికీ రాణించకపోతే వారిని జట్టు నుంచి తప్పిస్తారు. అయితే తాజా ఐపీఎల్‌లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ తన సాంప్రదాయాన్ని పక్కనపెట్టింది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైన ఇద్దరు ఆటగాళ్లను తాజా మ్యాచ్ నుంచి తప్పించారు.
తాజా సీజన్‌లో సీఎస్కే మిడిలార్డర్ దారుణంగా విఫలమవుతోంది. ముఖ్యంగా దీపక్ హుడా, సామ్ కర్రన్ జట్టుకు భారంగా మారుతున్నారు. ఆల్‌రౌండర్ అయిన కర్రన్ అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ప్రభావం చూపించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో సామ్ కర్రన్ దారుణంగా విఫలమయ్యాడు. సామ్ కరణ్ వేసిన ఆఖరి ఓవర్‌లో టిమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్స్‌లు బాదాడు. అలాగే దీపక్ హుడా గత రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యాడు. దీంతో చెన్నై ఫ్యాన్స్ వీరిద్దరినీ తప్పించాలని సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ డిమాండ్‌ను మన్నించిందో లేదా వ్యూహం మార్చిందో కానీ చెన్నై మేనేజ్‌మెంట్ దీపక్ హుడా, సామ్ కర్రన్‌పై వేటు వేసింది. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తుది జట్టు నుంచి దీపక్ హుడా, సామ్ కర్రన్‌ను తప్పించారు. వారి స్థానంలో విజయ్ శంకర్, ఓవర్టీన్ జట్టులోకి వచ్చారు. మరి, వీరైనా చెన్నై జట్టుకు అదృష్టాన్ని తీసుకొస్తారేమో చూడాలి.
ఇవి కూడా చదవండి..
IPL 2025: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్
IPL 2025, CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్.. ఈ ఇద్దరిలో పైచేయి ఎవరిది
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..