Share News

IPL 2025, DC vs GT: దంచికొట్టిన డీసీ.. ఛేజింగ్ అంత ఈజీ కాదు

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:37 PM

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన జోరును కొనసాగిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

IPL 2025, DC vs GT: దంచికొట్టిన డీసీ.. ఛేజింగ్ అంత ఈజీ కాదు
DC vs GT

వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు తన జోరును కొనసాగిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది (DC vs GT). ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన డీసీ బ్యాటర్లు దంచికొట్టారు. ఎవరూ భారీ స్కోరు సాధించకపోయినప్పటికీ క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు అందరూ తమ వంతు పరుగులు చేశారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. గుజరాత్ ఎదుట 204 పరుగుల భారీ స్కోరును నిర్దేశించింది (IPL 2025).


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటర్లు కరుణ్ నాయర్ (31), కేఎల్ రాహుల్ (28), అక్షర్ పటేల్ (39), స్టబ్స్ (31), అశుతోష్ శర్మ (37) రాణించడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. అందరూ తమ వంతు వేగంగా పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసినప్పటికీ ఢిల్లీ బ్యాటర్లు మాత్రం వేగం తగ్గించలేదు. అందరూ వేగంగా ఆడి పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్, సిరాజ్, అర్షద్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.


అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ భారీ స్కోరును ఛేదించడం కాస్త కష్టంగానే కనబడుతోంది. ఈ సీజన్‌లో గుజరాత్ టీమ్ ఛేజింగ్‌లో కంటే మొదటి బ్యాటింగ్ చేసినపుడే బాగా ఆడుతోంది. మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ వంటి బౌలర్లను ఎదుర్కొని ఈ స్కోరును ఛేజింగ్ చేయడం గుజరాత్‌కు కాస్త కష్టంగానే కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2025 | 09:14 PM