Share News

IPL 2025 DC vs LSG: ఢిల్లీ సునాయాస విజయం.. లఖ్‌నవూకు మరో ఓటమి

ABN , Publish Date - Apr 22 , 2025 | 10:57 PM

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో పరాజయం నుంచి కోలుకుని మళ్లీ విన్నింగ్ ట్రాక్ ఎక్కింది. 5 వికెట్ల తేడాతో లఖ్‌నవూను ఓడించింది. కేఎల్ రాహుల్ మరోసారి విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు ఓపెనర్లు ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేక లఖ్‌నవూ చతికిల పడింది.

IPL 2025 DC vs LSG: ఢిల్లీ సునాయాస విజయం.. లఖ్‌నవూకు మరో ఓటమి
DC won by 8 wickets against LSG

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్‌లో పరాజయం నుంచి కోలుకుని మళ్లీ విన్నింగ్ ట్రాక్ ఎక్కింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో లఖ్‌నవూను ఓడించింది. కేఎల్ రాహుల్ మరోసారి విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు ఓపెనర్లు ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేక లఖ్‌నవూ చతికిల పడింది. భారీ స్కోరు చేస్తుందనుకుంటే తడబడి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దీంతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది.


టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లఖ్‌నవూ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్‌క్రమ్ తొలి వికెట్‌కు 87 పరుగులు రాబట్టారు. దీంతో లఖ్‌నవూ భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపించింది. అయితే మార్‌క్రమ్ అవుట్ కాగానే పరిస్థితి మారిపోయింది. నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్ వెంటవెంటనే అవుటయ్యారు. చివర్లో బదోనీ (36) కీలక పరుగులు చేశాడు. దీంతో లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు తీశాడు.


160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. ఓపెనర్ అభిషేక్ పొరెల్ (51) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ (57) కూడా తన ఫామ్‌ను కొనసాగించాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (34) కూడా తన వంతు బాధ్యత నిర్వర్తించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను చేరుకుంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 22 , 2025 | 10:58 PM