Share News

IPL 2025, DC vs RR: టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే

ABN , Publish Date - Apr 16 , 2025 | 07:06 PM

ఈ సీజన్‌లో అత్యంత స్థిరంగా రాణిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. ఆ ఓటమి నుంచి తేరుకుని మళ్లీ గెలుపు బాట పట్టేందుకు అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెడీ అవుతోంది.

IPL 2025, DC vs RR: టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే
RR VS DC

ఈ సీజన్‌ (IPL 2025)లో అత్యంత స్థిరంగా రాణిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals) గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. ఆ ఓటమి నుంచి తేరుకుని మళ్లీ గెలుపు బాట పట్టేందుకు అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెడీ అవుతోంది. ఈ రోజు (ఏప్రిల్ 16) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టుతో తలపడబోతోంది.


టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌కు సిద్ధమవుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం స్పిన్‌కు చక్కగా సహకరిస్తుంది. మొదటి ఇన్నింగ్స్‌తో పోల్చుకుంటే రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ కాస్త స్లో అవుతుంది. మంచు ప్రభావం లేకపోవడంతో వాతావరణం చాలా పొడిగా, వేడిగా ఉంటుంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. మరోవైపు రాజస్తాన్ టీమ్‌లోని కీలక ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి సతమతమవుతున్నారు.


తుది జట్లు:

ఢిల్లీ క్యాపిటల్స్: ఫాఫ్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్.

ఇంపాక్ట్ ప్లేయర్: కరుణ్ నాయర్/మోహిత్ శర్మ.

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్‌మెయిర్, శుభం దూబె, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహీష తీక్షణ, ఆకాశ్ మధ్వాల్.

ఇంపాక్ట్ ప్లేయర్: శుభమ్ దూబె/సందీప్ శర్మ.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2025 | 07:06 PM