IPL 2025: ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గేమ్ ఓవర్.. అద్భుతం జరిగితేనే ప్లే ఆఫ్స్ ఛాన్స్
ABN , Publish Date - Apr 21 , 2025 | 08:28 PM
ఇప్పటికి ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వరుస పరజయాలతో సతమతమవుతోంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై టీమ్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
ఇప్పటికి ఐదు సార్లు ఐపీఎల్ (IPL 2025) ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఈ సీజన్‌లో మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వరుస పరజయాలతో సతమతమవుతోంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన చెన్నై టీమ్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఘోర పరాజయం పాలైంది. ఏకంగా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఓడిపోవడంతో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్టే (MI vs CSK).
ముంబైతో ఓటమి అనంతరం మాట్లాడిన చెన్నై కెప్టెన్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్‌లో చెన్నై కథ ముగిసినట్టే అన్నట్టు మాట్లాడాడు. లఖ్‌నవూపై గెలిచి గాడిన పడినట్టు కనిపించిన ధోనీ సేన ముంబైతో మ్యాచ్‌లో అన్ని రంగాల్లోనూ విఫలమై ఓటమి మూటగట్టుకుంది. దీంతో ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయ్యే మొదటి జట్టుగా చెన్నై టీమ్ కనిపిస్తోంది. ఈ సీజన్‌లో చెన్నై టీమ్ తొలి ఐదు మ్యాచ్‌లను రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడింది. ఆ ఐదింట్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలిగాడు.
రుతురాజ్ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ అయినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. విజయాలు అందలేదు. ఒక్క లఖ్‌నవూ మ్యాచ్‌లో గెలిచినప్పటికీ తర్వాతి మ్యాచ్‌లో పరాజయం ఎదురైంది. మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఇదే టీమ్‌తో మంచి కమ్ బ్యాక్ ఇస్తాం అని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ పదో స్థానంలో ఉంది. ఇంకా ఆరు మ్యాచ్‌లో మిగిలి ఉన్నాయి. ఆ ఆరు మ్యాచ్‌లలోనూ వరుసగా విజయాలు సాధిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు చెన్నై కూడా రేసులోకి వస్తుంది. అలాగే ఇతర జట్ల విజయాలు కూడా చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేస్తాయి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..