Share News

IPL 2025: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్

ABN , Publish Date - Mar 30 , 2025 | 05:26 PM

ఈ ఐపీఎల్ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రచారం చేస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఐపీఎల్ అటు టీవి నెట్‌వర్క్‌కు, ఇటు జియో హాట్‌స్టార్ యాప్‌నకు రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్‌ను అందిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ తొలి వీకెండ్ కళ్లు చెదిరే స్థాయి వ్యూయర్‌షిప్‌ను అందించింది.

IPL 2025: దుమ్మురేపుతున్న జియో హాట్‌స్టార్.. రికార్డులు బద్దలుగొడుతున్న వ్యూయర్‌షిప్
JioHotstar

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఐపీఎల్ (IPL 2025) మార్చి 22వ తేదీన ఘనంగా ఆరంభమైంది. ఈ ఐపీఎల్ మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్ (JioHotstar), స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రచారం చేస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఐపీఎల్ అటు టీవీ నెట్‌వర్క్‌కు (Star Sports Network), ఇటు జియో హాట్‌స్టార్ యాప్‌నకు రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్‌ (viewership)ను అందిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ తొలి వీకెండ్ కళ్లు చెదిరే స్థాయి వ్యూయర్‌షిప్‌ను అందించింది. జియో హాట్‌స్టార్‌లో ఈ ఐపీఎల్ తొలి వీకెండ్ మూడు మ్యాచ్‌లకు ఏకంగా 137 కోట్ల వ్యూస్ వచ్చాయి. గత సీజన్‌తో పోల్చుకుంటే ఇది ఏకంగా 40 శాతం ఎక్కువ.


ఇక, బార్క్ రికార్డుల ప్రకారం టాటా ఐపీఎల్ తొలి వీకెండ్ మ్యాచ్‌లు సరికొత్త రికార్డులను లిఖించాయి. టీవీల్లో తొలి మూడు ఐపీఎల్ మ్యాచ్‌లను ఏకంగా 25.3 కోట్ల మంది వీక్షించారు. గత సీజన్‌తో పోల్చుకుంటే ఇది 27 శాతం ఎక్కువ. గతంతో పోల్చుకుంటే వ్యూయర్‌షిప్ పెరగడాన్ని బట్టి చూస్తుంటే ఐపీఎల్ పాపులారిటీ ప్రతి ఏటా పెరుగుతోంది. కాగా, జీయో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లలో 12 భాషల్లో కామెంట్రీ చెబుతున్నారు. ఇందుకోసం ఏకంగా 170 మంది విశ్లేషకులు పని చేస్తున్నారు.


కాగా, తాజా ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు,రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. తొలి వీకెండ్‌లో జరిగిన ఈ మూడు మ్యాచ్‌లకు రికార్డు స్థాయి వ్యూయర్ షిప్ లభించింది. ఇక, రాబోయే రోజుల్లో జియో హాట్‌స్టార్, స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్ వ్యూయర్‌షిప్‌లో ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతాయో చూడాలి.

ఇవి కూడా చదవండి..

నితీష్ రెడ్డికి సరికొత్త చాలెంజ్

ఐపీఎల్ ఓనర్లలో మోస్ట్ రిచ్ ఎవరంటే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 30 , 2025 | 05:26 PM