IPL 2025, KKR vs GT: గుజరాత్ బ్యాటర్ల హవా.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్
ABN , Publish Date - Apr 21 , 2025 | 09:12 PM
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (90)తో పాటు సూపర్ ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ (52) కూడా హాఫ్ సెంచరీ సాధించడంతో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. సాయి సుదర్శన్‌కు ఈ సీజన్‌లో ఇది ఐదో హాఫ్ సెంచరీ. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ జట్టు తాజా మ్యాచ్‌లో కూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లోకోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (90)తో పాటు సూపర్ ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్ (52) కూడా హాఫ్ సెంచరీ సాధించడంతో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు చేసింది. సాయి సుదర్శన్‌కు ఈ సీజన్‌లో ఇది ఐదో హాఫ్ సెంచరీ. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించారు. రస్సెల్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన జాస్ బట్లర్ (41) కూడా కీలక రన్స్ చేశాడు. కోల్‌కతా ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం కూడా గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లకు కలిసి వచ్చింది. సెంచరీకి చేరువలోకి వచ్చిన తర్వాత గిల్ అవుటయ్యాడు. గిల్ అవుట్ అయిన తర్వాత పరుగుల వేగం నెమ్మదించింది. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. కోల్‌కతా ముందు 199 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.
కోల్‌కతా బౌలర్లలో వైభవ్, హర్షిత్ రాణా, ఆండ్రూ రస్సెల్ ఒక్కో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే కోల్‌కతా బ్యాటర్లు సమష్టిగా రాణించాల్సిందే. ఓపెనర్లు డికాక్, నరైన్‌తో పాటు అజింక్య రహానే మిడిలార్డర్‌లోని వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్ కూడా పరుగులు చేయాల్సి ఉంది. గుజరాత్ బౌలర్లను ఎదుర్కొని ఈ భారీ టార్గెట్‌ను ఛేదించడం కోల్‌కతాకు కాస్త కష్ట సాధ్యమైన పనే అని చెప్పాలి. అయితే కోల్‌కతా బ్యాటర్లను తక్కువ అంచనా వేయడానికి లేదు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..